తెలుగు సినీరంగంలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్. మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టి.. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు 8 వసంతాలు సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. జూన్ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా మంగళవారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే తాజాగా హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు.
8 వసంతాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనంతకి తన టాలెంట్స్ అన్నీ బయటపెట్టింది. ఆమె మల్టీటాలెంటెడ్ అని అందరికి తెలిసిన విషయమే. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 19 సంవత్సారుల. ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన అనంతిక.. ప్రస్తుతం లాయర్ కోర్సు చేస్తుంది. అలాగే చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. అంతేకాకుండా కరాటేలో ఆమెకు బ్లాక్ బెల్ట్ ఉంది. కేరళకు చెందిన కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ సైతం నేర్చుకుంది. కత్తి ఫైటింగ్ లోనూ ఆమె సిద్ధహస్తురాలే.. ఇవే కాకుండా కేరళ సంప్రదాయంలోని చెండా (డ్రమ్స్) సైతం వాయిస్తుంది. కేవలం ఒకటి కాకుండా అనేక రంగాల్లో అనంతిక ప్రతిభావంతురాలు.
ఇవి కూడా చదవండి
తాజాగా 8 వసంతాలు ప్రీ రిలీజ్ వేడుకలో అనంతిక టాలెంట్స్ చూపించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. ఈబ్యూటీ మల్టీటాలెంటెడ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు. అనంతిక సనీల్ కుమార్ ప్రస్తుతం 8 వసంతాలు సినిమాతోపాటు రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాలోనూ నటిస్తుంది. ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు.
A teaser of the talent @Ananthika108 possesses ❤🔥
Her performance as Shuddhi Ayodhya in #8Vasantalu will be spellbinding 💥💥#8Vasantalu grand release worldwide on June 20th. pic.twitter.com/dipV0vkXKT
— Mythri Movie Makers (@MythriOfficial) June 18, 2025
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..