Allu Arjun: ‘ నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు.. వారి సపోర్ట్ తోనే ఈ స్థాయికి వచ్చాను’: అల్లు అర్జున్

Allu Arjun: ‘ నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు.. వారి సపోర్ట్ తోనే ఈ స్థాయికి వచ్చాను’: అల్లు అర్జున్


ముంబై వేవ్స్ సదస్సు వేదికగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ ఐకాన్ స్టార్.

‘వేవ్స్‌ సమిట్‌ను నిర్వహించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు. అలాగే ప్రధాని మోదీకి కూడా కృతజ్ఞతలు. ప్రతి రంగంలో భారత్‌ దూసుకెళ్తోంది. గ్లోబల్‌ బాక్సాఫీస్‌లో కూడా భారత్‌ సత్తా చాటబోతోంది. ఇక నా విషయానికి వస్తే.. మా తాత అల్లు రామలింగయ్య 1000 సినిమాల్లో నటించారు. మా తండ్రి అల్లు అరవింద్‌ 70 సినిమాలు నిర్మించారు. మా మామ చిరంజీవి సౌత్‌లో సూపర్‌స్టార్‌. మా ఫ్యామిలీ, ఫ్యాన్స్‌ సపోర్ట్‌తో ఈ స్థాయికి వచ్చాను. అలాగే అభిమానులంటే నాకు ప్రాణం. దేశవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు. నా కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తారు. అభిమానులను దృష్టిలో పెట్టుకునే పాత్రలను ఎంపిక చేసుకుంటాను. అభిమానుల ఆదరణే నన్ను ఈ స్థాయికి చేర్చింది. ప్రతి సినిమా నాకు ముఖ్యమే. విలక్షణ నటన కోరుకుంటాను. ఇక నా ఫిట్‌నెస్‌కు కారణం నా మానసిక ప్రశాంతతే. షూటింగ్‌లో లేనప్పుడు కూడా నాకు ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచే డాన్స్‌ అంటే ఇష్టం. కానీ ఓ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినప్పుడు భయపడ్డాను. నా 10వ సినిమాలో యాక్సిడెంట్‌ జరిగింది. ఆ సమయంలో చాలా భయపడ్డాను. ఆరునెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. కానీ సవాళ్లు అధిగమించా.. మళ్లీ సినిమాలు చేశా. నాకు సినిమా తప్ప వేరే ఆలోచన లేదు. 20వ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. పుష్ప సినిమాతో నాకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది’.

‘సినిమా తప్ప వేరే ఆలోచన లేదు. ఇక షూటింగ్‌ లేకపోతే హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను. ప్రతి నటుడికి ఫిట్‌నెస్‌ చాలా కీలకం.
షూటింగ్‌లో లేనప్పుడు కూడా నాకు ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. సిక్స్‌ ప్యాక్‌ కోసం చాలా కష్టపడ్డా. అలాగే 18వ సినిమా ఫ్లాప్‌ కావడంతో ఆత్మ పరిశీలన చేసుకున్నా. ఫ్లాప్‌ నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఎవరైనా మంచి కోసమే సలహాలు ఇస్తారు. ఎంతోమంది పెద్దలు నాకు సలహాలు ఇస్తారు’ అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *