Alekhya Chitti Pickles: ఆస్పత్రిలో అలేఖ్య.. త్వరలో కొత్త బిజినెస్.. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూపై అన్వేష్

Alekhya Chitti Pickles: ఆస్పత్రిలో అలేఖ్య.. త్వరలో కొత్త బిజినెస్.. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూపై అన్వేష్


పచ్చళ్లు రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని అడిగిన ఓ కస్టమర్ పై ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయింది అలేఖ్య చిట్టి. దీంతో అప్పటివరకు వీరిపై ఉన్న పాజిటివ్ ఓపినియన్ అంతా నెగెటివ్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అక్కాచెల్లెళ్లపై మీమ్స్, ట్రోల్స్ వీడియోలు కనీసం 100 మిలియన్స్‌కు పైగానే వ్యూస్‌తో ట్రెండ్‌ అవుతున్నాయంటే వీరిపై ఎంతటి నెగెటివిటీ వచ్చిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఇప్పటికే అలేఖ్య చిట్టి, రమ్య బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తమ తప్పును అంగీకరించారు. అయినా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇదే విషయంపై ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ స్పందించాడు. చిట్టి, అలేఖ్య, రమ్య తనకు చెల్లెల్లతో సమానమన్నాడు. అలాగే అలేఖ్య బూతులపై తన తరఫున కూడా క్షమాపణలు చెబుతున్నానన్నాడు. ‘అలేఖ్య, చిట్టి, రమ్య యూట్యూబ్‌ ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడు నన్ను సంప్రదించారు. అందుకే నేను వారికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాను. అయితే వారు కూడా బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారు. కానీ నేను వద్దని చెప్పగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం ఆపేశారు.

‘అలేఖ్య అలా బూతులు మాట్లాడకుండా ఉండాల్సింది. ఏదో ఫ్రస్టేషన్‌లో కస్టమర్లను తిట్టింది. వ్యాపారం చేయడం చేతకాక అలా చేసింది. బీపీ ఎక్కువై, కర్మ బాగోలేక, ఇంకా చెప్పాలంటే బలుపు ఎక్కువై తిట్టేసింది. ఇప్పుడు అంతా అయిపోయింది. నోటి దూల ఉన్నోళ్లకు బిజినెస్ పనిచెయ్యదు. వారి దుకాణాలన్నీ బంద్ అయిపోయాయి. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్స్‌తో అలేఖ్య అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. అందువల్ల వారిని కనికరించి ఇక వదిలేయండి’.

ఇవి కూడా చదవండి

అన్వేష్ కామెంట్స్.. వీడియో ఇదిగో..

ఇప్పుడు వారి పచ్చళ్ల బిజినెస్ పూర్తిగా బంద్ అయిపోయింది. త్వరలోనే లడ్డూల బిజినెస్ ప్రారంభించబోతున్నారు. అలేఖ్య చెల్లి రమ్య త్వరలో పూతరేకులు, స్వీట్స్, లడ్డూ వంటివాటితో కొత్త వ్యాపారం ప్రారంభించనుంది’ అని అన్వేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

త్వరలోనే లడ్డూల బిజినెస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *