సినిమా ఇండస్ట్రీలో సెటిల్ కావాలంటే ఏ చదువు చదవాలి? చదువు సంగతేమోగానీ.. ఇప్పుడున్న సిట్చువేషన్‌లో ప్యాన్ ఇండియా ఎంట్రన్స్ రాయాలి.
ఆల్రెడీ రీజినల్‌గా ప్రూవ్ చేసుకున్న మాస్ కెప్టెన్స్ అయినా.. ప్యాన్ ఇండియా ఎంట్రన్స్ పక్కాగా అటెండ్ కావాల్సిందే.
లేటెస్ట్ గా ఈ ఎంట్రన్స్ రాయడానికి అఖండ 2తో ప్రిపేర్ అవుతున్నారు బోయపాటి. నందమూరి బాలకృష్ణ – బోయపాటి కలిసి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే విషయం మన దగ్గర మళ్లీ మళ్లీ ప్రూవ్ అవుతూనే ఉంది.
అఖండ సినిమా టైమ్‌లో ఈ స్టేట్మెంట్ జబర్దస్త్ గా ప్రూవ్ అయింది. ఆ మూవీ వైబ్స్ నార్త్ లోనూ పాజిటివ్‌గా కనిపించాయి.
అందుకే ఇప్పుడు అఖండ సీక్వెల్ తాండవంని ప్యాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు జరిగాయి.
సినిమా మీద అద్భుతమైన హోప్స్ ఉన్నాయని చెప్పేశారు బాలయ్య. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్‌ని కూడా ప్లానింగ్‌గా చేసుకున్నారు బోయపాటి. అఖండ2తో ప్యాన్ ఇండియా రేంజ్లో ప్రూవ్ చేసుకోవాలన్నది బోయపాటి ఐడియా.
డివైన్ టచ్ ఉన్న మన కంటెంట్‌కి నార్త్ లో ఇప్పుడు యమా క్రేజ్ ఉంది. అఖండ2లో ఆధ్యాత్మిక టచ్ బాగానే ఉంది. ఈ పాజిటివ్ వైబ్ బోయపాటికి విజిటింగ్ కార్డులా ఉపయోగపడుతుందా?
ప్యాన్ ఇండియా ఎంట్రన్స్ లో ఆయన డిస్టింక్షన్లో పాస్ అవుతారా అనేది ఫిల్మ్ నగర్లో డిస్కస్ అవుతున్న పాయింట్.