Ajith Kumar: రేసింగ్ కోసం కొత్త మెర్సిడెస్ కారు కొన్న అజిత్.. ధర తెలిస్తే షాకే..

Ajith Kumar: రేసింగ్ కోసం కొత్త మెర్సిడెస్ కారు కొన్న అజిత్.. ధర తెలిస్తే షాకే..


ఈ ఏడాది వరుస హిట్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు అజిత్. విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో సక్సెస్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అటు కార్ రేసింగ్‏లోకి అడుగుపెట్టారు. గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల తర్వాత కారు రేసింగ్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా అజిత్ మెర్సిడెస్-ఎఎమ్‌జి జిటి3 రేసింగ్ కారును కొనుగోలు చేశాడు. ఆ కారుతో అజిత్ ఉన్న ఫోటోస్, వీడియోస్ ఇప్పుడ్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ కారు ఫీచర్స్, ధర గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అజిత్ కొత్త మెర్సిడెస్-AMG GT3 రేసింగ్ కారు ధరకు సంబంధించి సమాచారం ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం కొత్త మెర్సిడెస్-AMG GT3 రేసింగ్ కారు ధర రూ.10 కోట్లకు పైగా ఉంటుందని టాక్. ఈ కారు రేసింగ్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అజిత్.. GT4 యూరోపియన్ సిరీస్ మూడవ రౌండ్ కోసం బెల్జియంకు వెళ్లారు.

అజిత్ కుమార్ చివరిసారిగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం అజిత్ AK46 చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం చివర్లో అది బయటకు వచ్చే అవకాశం ఉంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *