టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే అహ్మదాబాద్-లండన్ విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ మేఘాని ఏరియాలో సివిల్ ఆస్పత్రి సమీపంలోని జనావాసాలపై ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైన్ విమానం కూలింది. 1985 తర్వాత ఎయిర్ఇండియా విమానయాన సంస్థకు అతిపెద్ద క్రాష్ ఇది. ప్రమాదం సమయంలో 240మంది ప్రయాణికులు పది మంది క్యాబిన్ క్రూ.. ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఇది ఇలా ఉంటే భారత్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాలు ఏవంటే.?
1985 – ఎయిర్ ఇండియా ఫ్లైట్-182పై టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది. విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో బాంబ్ పెట్టి పేల్చారు టెర్రరిస్టులు. ఈ విమాన ప్రమాదంలో 329 మంది మృతి చెందారు. భారత విమాన చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం.
1996 – హర్యానాలో గాల్లోనే రెండు విమానాల ఢీకొన్నాయి. సౌదీ ఎయిర్ లైన్స్, కజకిస్తాన్ ఎయిర్ లైన్స్ విమానాలు రెండూ మిడ్ ఎయిర్‌లో ఢీకొట్టాయి. ఈ ఘటనలో 349 మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అతిపెద్ద మిడ్ ఎయిర్ ప్రమాదాల్లో ఒకటి ఇది.
2010 మే 22– మంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX812 విమానం ల్యాండింగ్‌లో రన్‌వే దాటి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 158 మంది మృతి చెందారు. కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
1990 – బెంగళూరు ఎయిర్ ఇండియా ప్రమాదంలో 92 మంది మృతి చెందారు. ల్యాండింగ్ సమయంలో కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
2000 – పట్నా ఎయిర్ సాహారా ప్రమాదం. ఈ విమాన ప్రమాదంలో 60కి పైగా మృతి చెందారు. ఇంజిన్ ఫెయిల్యూర్‌తో ఈ విమానం కుప్పకూలింది.
1978 – జనవరి 1: బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలి 213 మంది మరణించారు.
1988 అక్టోబర్ 19: అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ కూలి 133 మంది మరణించారు.
Very shocked to hear about the #AirIndia Ahmedabad-London flight incident near Ahmedabad airport. Praying for the safety of all passengers and crew. 🙏#PlaneCrash #Ahmedabad pic.twitter.com/jmKkgJbHeU
— TVK Vijay Trends (@TVKVijayTrends) June 12, 2025