గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12) ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. అలాగే ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటికే పలువురు మరణించినట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదం గురించి తెలిసి దేశమంతా కన్నీరు పెడుతోంది. విమానంలో ఉన్నవారందరూ క్షేమంగా ప్రాణాలతో బయట పడాలని కోరుకుంటున్నారు. ఈ విమాన ప్రమాదంతో సినిమా ఇండస్ట్రీ కూడా తల్లడిల్లుతోంది. అక్షయ్ కుమార్, సోను సూద్, సన్నీ డియోల్, దిశా పటాని తదిరత సినీ ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే పలు సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లు ఇతర కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప టీమ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
ట్రైలర్ రిలీజ్ వాయిదా..
మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ( జూన్ 13) కన్నప్ప సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు మంచు విష్ణు.
ఇవి కూడా చదవండి
మంచు విష్ణు ట్వీట్..
My heart breaks for the lives lost in today’s Ahmedabad Air India crash. In deep mourning, we’re deferring the #Kanappa trailer release by one day and canceling tomorrow’s Indore pre‑release event. My prayers are with the families during this unimaginably difficult time. 💔
— Vishnu Manchu (@iVishnuManchu) June 12, 2025
అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. ట్రైలర్ రిలీజ్ ని ఒకరోజు వాయిదా వేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .