అత్యుత్తమ పనితీరు కనబరిచే ఏసీలలో ఎల్ జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఒకటి. దీనిలోని విరాట్ మోడ్ తో వేగవంతమైన చల్లదనం పొందవచ్చు. దీనిలో ఆరు కన్వర్టిబుల్ మోడ్ లు ఉన్నాయి. వాటిలోని ఏఐ మోడ్ ద్వారా గదిలోని వేడిని గుర్తించి, దానికి అనుగుణంగా చల్లదనాన్ని సెట్ చేస్తుంది. ఎక్కువ దూరం వీచే ఎయిర్ త్రో, రాగి కండెన్సర్ కాయిల్, బ్లాక్ ఓషన్ టెక్నాలజీ, ఏసీ జీవితకాలం పెంచేలా గోల్డ్ ఫిన్ ప్లస్ పూత, యాంటీ వైరస్, హెచ్ డీ ఫిల్టర్ దీని ప్రత్యేకతలు, సుమారు 111 నుంచి 150 చదరపు అడుగుల విస్తీర్ణం గల గదులకు సరిపోతుంది. అమెజాన్ లో దీని ధర రూ.45,490.