AI effect on Jobs: AIతో మీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా.? వీడియో

AI effect on Jobs: AIతో మీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా.? వీడియో


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలే కాకుండా రోజువారీ జీవితంలో చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ వినియోగంపై OpenAI సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ స్పందించారు. జాబ్‌ మార్కెట్లో ఏఐ అనేక మార్పులను తీసుకొస్తుందన్నారు. జాబ్‌ మార్కెట్‌ లో ఏఐ రాకతో మొదలయ్యే అనుకూల, ప్రతికూల అంశాలపై ఆల్ట్‌మన్‌ తాజాగా తన బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపారు.

చాలా ఉద్యోగాల్లో నెమ్మదిగా మార్పులు వస్తాయనీ శామ్‌ ఆల్ట్‌మన్‌ అన్నారు. అయితే మనకు పని ఉండదేమో అనే ఆలోచనపై తనకు భయం లేదనీ ఎందుకంటే.. ఏఐ కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందనీ అన్నారు. దీంతోపాటు మానవులు మరింత సృజనాత్మకతక, అర్థవంతమైన పనిపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుందనీ మన సామర్థ్యాలను మెరుగుపరుస్తుందనీ తెలిపారు. ఈ రోజు చేసే అనేక ఉద్యోగాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం వారికి సమయం వృథా చేసేవిలా అనిపించవచ్చనీ అలానే.. భవిష్యత్‌ తరాలు మన ప్రస్తుత పనిని పాతవి లేదా అనవసరమైనదిగా భావించొచ్చనీ చెప్పారు. అయితే గతంలో వచ్చిన సాంకేతికను ప్రజలు ఏవిధంగా అందిపుచ్చుకున్నారో.. ఏఐ తీసుకొచ్చే మార్పులకు అలానే మారతారని అన్నారు. కేవలం ఉద్యోగాల పరంగానే కాకుండా సమాజంపై కూడా ఏఐ ఎటువంటి ప్రభావం చూపనుందో వివరించారు.

అసాధ్యమని భావించిన వాటిని సాధించడానికి కృత్రిమ మేధ మానవాళికి సాయం చేస్తుందని శామ్‌ఆల్ట్‌మన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణ నుంచి విద్య వరకు ప్రతీ విభాగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఏ విషయాన్నైనా, ఏ భాషలోనైనా వేగంగా సూచనలు అందిస్తుందన్నారు. వాతావరణ మార్పు, ఆవిష్కరణలు వంటి సవాళ్లను పరిష్కరించేందుకు ఏఐ సాయం చేస్తుందన్నారు. ఏఐ రాకతో ప్రతి ఒక్కరి జీవితాలూ ప్రస్తుతం ఉన్నదానికంటే మెరుగ్గా మారనున్నాయని తెలిపారు. అదే సమయంలో ఏఐ రాకతో మొదలయ్యే ప్రతికూలాంశాలను ఆయన ప్రస్తావించారు. ఏఐతో కలిగే ప్రయోజనాలకు పొందాలంటే సాంకేతికతను జాగ్రత్తగా వినియోగించాలని ఆల్ట్‌మన్‌ హెచ్చరించారు. ఏఐ.. దానికి సాయం చేసే కంప్యూటర్‌ పవర్‌ని సంపన్నులకే కాకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది అసలు సమస్య అని ఆయన అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *