సినీరంగంలోకి అడుగుపెట్టిన వెంటనే స్టార్ డమ్ రావడం.. సక్సెస్ కావడమంటే అతిశయోక్తి కాదు. నటీనటులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ ఎక్కువగా తిరస్కరణలు, అవమానాలు, విమర్శలతో బాధపడిన తారలు చాలామంది ఉన్నారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సూపర్ స్టార్లుగా మారిన హీరోయిన్స్.. ఇప్పుడు తమ కెరీర్ మొదటి రోజులను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్.. సైతం 17 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ అప్పుడే బాడీ షేమింగ్ కామెంట్స్ రావడంతో మానసిక ఒత్తిడికి గురైంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శిల్పా శెట్టి.
శిల్పా శెట్టి.. భారతీయ సినీప్రియులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో నిర్మాతల నుంచి అనేక తిరస్కరణను ఎదుర్కొంది. సినిమాల్లోకి అడుగుపెట్టిన మొదట్లో ఆమె చాలా అవమానాలను ఎదుర్కొందట. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వెయకుండా తన ప్రయత్నాలను వదులుకోలేదు. 17 ఏళ్లకే నటిగా కెరీర్ స్టార్ట్ చేశానని.. తాను ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ తన ఫోటో తీసి ఫ్యాషన్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడని తెలిపింది.
ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..
Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..
యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు తన వయసు 17 ఏళ్లు మాత్రమే అని.. అప్పటికీ ఈ గ్లామర్ ప్రపంచం తనకు అర్థం కాలేదని తెలిపింది. హిందీలో మాట్లాడం, కెమెరా ముందు నిలబడడం కూడా రాలేదని తెలిపింది. ఎలాంటి కారణాలు లేకుండానే తనను సినిమాల నుంచి తీసేశారని.. శారీరక విమర్శలు చేస్తూ.. తనను వివక్షకు గురిచేశారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తెలుగుతోపాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. నివేదికల ప్రకారం శిల్పా శెట్టి ఆస్తులు రూ. 130 కోట్లు ఉంటుందట.
View this post on Instagram
Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Telugu Cinema: టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‌గా.. ఎవరంటే..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..