సినీరంగంలోకి ఇప్పుడిప్పుడే కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చూపు తిప్పుకోనివ్వని అందంతోపాటు తమ నటనతో సినిమా ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్నారు. తక్కువ సమయంలోనే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకంటున్నారు. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ లతో ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె.. ఆ తర్వాత ప్రధాన పాత్రలు పోషించింది. ఇటీవల సూపర్ హిట్ అయిన సైతాన్ వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుపట్టారా.. ? మహి. వి. రాఘవన్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించగా.. ఇందులో దేవయాని శర్మ కీలకపాత్ర పోషించింది. భానుమతి అండ్ రామకృష్ణ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే మెప్పిస్తుంది. ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాలో హీరో స్నేహితురాలిగా కనిపించింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సైతాన్ వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
2023లో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్ దేవయానికి జనాలకు దగ్గర చేసింది. అదే ఏడాది వచ్చిన సైతాన్ సిరీస్ మాత్రం ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇందులో తన నటనతో ఆకట్టుకుంది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు హిందీలో లవ్ శుదా అనే చిత్రంలో కనిపించింది. తెలుగులో ఇప్పుడిప్పుడే పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..