Actress : బాలయ్య, ఎన్టీఆర్‌లతో నటించింది.. 50 ఏళ్లైనా స్టిల్ సింగిల్.. ఎవరంటే..

Actress : బాలయ్య, ఎన్టీఆర్‌లతో నటించింది.. 50 ఏళ్లైనా స్టిల్ సింగిల్.. ఎవరంటే..


ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్. సీనియర్, జూనియర్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు 21 ఏళ్ల క్రితం ఒక్క బ్లాక్ బస్టర్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సినిమాలతో వరుస హిట్లు ఖాతాలో వేసుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అమీషా పటేల్. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇవి కూడా చదవండి

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్. అందం, అభినయంతో కోట్లాది మంది జనాల హృదయాలు గెలుచుకుంది. అగ్ర హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. మహేష్ బాబు, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. 2000లో హృతిక్ రోషన్ సరసన కహో నా ప్యార్ హై సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో తెలుగు, హిందీ భాషలలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడిగా బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మహేష్ బాబుతో నాని చిత్రంలో నటించింది.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు..ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చింది. 2023లో గదర్ 2 సినిమాతో రీఎంట్రీలోనూ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *