పైన ఫోటోలో క్యూట్ గా చూస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.. ? సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతోపాటు గ్లామరస్ బ్యూటీగా కట్టిపడేసింది. తెలుగులో కథానాయికగా ఆమె చేసిన ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు.కానీ ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తనతో కలిసి నటించిన ఓ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం 16 ఏళ్లు. ఇంతకీ ఈ క్యూట్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె పేరు సయేషా సైగల్.
ముంబైకి చెందిన సయేషా ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆమె నానమ్మ నసీర్ బాను 1930, 50 మధ్యకాలంలో హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్. అప్పట్లో వరుస సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసింది. బీటౌన్ స్టార్ దిలీప్కుమార్, నటి సైరా బాను, నటి ఫరా ఆమెకు దగ్గరి బంధువులు. హిందీనటుడు సుమీత్ సైగల్ కూతురే సయేషా. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన సయేషా… సొంత ప్రతిభతోనే అవకాశాల కోసం ప్రయత్నించింది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..
2005లో సూర్య నటించిన గజినీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషలలో అవకాశాలు అందుకుంది. అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఫస్ట్ మూవీతోనే గ్లామరస్ బ్యూటీగా కట్టిపడేసిన సయేషాకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..
తమిళ్ హీరో ఆర్య సరసన గజినీకాంత్ సినిమాలో నటించింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు 2019 మార్చిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి పాప జన్మించింది. ఆర్య సయేషా కంటే 16 ఏళ్ల పెద్ద. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది సయేషా.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..