ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఆమె 90’s మూవీ లవర్స్ కలల అమ్మాయి. 15 ఏళ్ల వయసులో మలయాళంలో అరంగేట్రం చేసింది. అదే సమయంలో తెలుగులోనూ నటించింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రంభ. 1992లో వినీత్ సరసన “సర్గం” చిత్రంలో నటించింది. అదే సమయంలో తెలుగులో ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో నటించింది. తమిళంలో “ఉజవన్” చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.
కథానాయికగానే కాకుండా స్పెషల్ పాటలతోనూ అలరించింది. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ ను వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రంభ.. ఇప్పుడిప్పుడే పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరించింది. ఇప్పటివరకు రంభ సినిమాల్లో నటించలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తుంది.
ఇదిలా ఉంటే.. రంభ భర్త పెద్ద వ్యాపారవేత్త. అతడు ఇంటి ఇంటీరియర్లకు ప్రసిద్ధి చెందిన మ్యాజిక్ వుడ్స్ కంపెనీకి డైరెక్టర్. ఇంద్రకుమార్ మొత్తం 5 కంపెనీలను నడుపుతున్నారు. వీటిలో కొన్ని కంపెనీలు చెన్నైలో పనిచేస్తున్నాయి. ఆయన 2000 కోట్ల రూపాయల ఆస్తికి యజమాని అని సమాచారం. రంభ భర్త శ్రీలంకలో యుద్ధ బాధిత విద్యార్థుల విద్యలో మార్పు తీసుకురావడానికి విద్యా సంస్థలను స్థాపించారు. అలాగే వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి కొన్ని ఐటీ కంపెనీలను సైతం స్థాపించారు.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

Rambha News
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..