కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్ల క్రితం కంగువ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. ఇక మొన్న సూర్య నటించిన రెట్రో సినిమాకు సైతం మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు సరైన హిట్టు కోసం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టారు సూర్య. ప్రస్తుతం డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సూర్య సరసన మృణాల్ ఠాకూర్ నటించనుందనే టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సూర్య తన ఫ్యామిలీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన భార్య జ్యోతికతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు. ఇటీవలే దియా ఇంటర్ పూర్తి చేసింది. నివేదికల ప్రకారం 12వ తరగతిలో దియా మంచి మార్కులు సాధించింది. పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుక గ్రాండ్ గా జరగ్గా జ్యోతిక, సూర్య దంపతులు పాల్గొన్నారు. తన కూతురితో కలిసి గర్వంగా నిలబడి ఫోజులు ఇచ్చిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
చాలా కాలంగా ఫ్యామిలీతో కలిసి చెన్నైలో నివసించిన సూర్య.. ఇప్పుడు ముంబై షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. తన పిల్లలు దియా, దేవ్ ముంబైలోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. వారిద్దరి చదువుల కోసమే తాము ముంబై షిఫ్ట్ అయినట్లు ఇటీవల చెప్పుకొచ్చారు సూర్య. దియా 12వ తరగతిలో 600కి 581 మార్కులు సాధించిందని టాక్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..