దక్షిణాది స్టార్ హీరోలలో శింబు ఒకరు. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 47 సినిమాల్లో నటించిన శింబుకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నాడు శింబు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న మూడు సినిమాలు త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబోలో రాబోతున్న థగ్ లైఫ్ మూవీలోనూ శింబు కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హీరో సినిమాల గురించి కాకుండా అతడి పర్సనల్ లైఫ్ గురించి అనేక రూమర్స్ హల్చల్ చేస్తుంటాయి.
కొన్నాళ్లుగా టాలీవుడ్ హీరోయిన్, శింబు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుందనే టాక్ నడుస్తోంది. తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించింది ఆ హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్న నిధి అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ గతంలో శింబుతో కలిసి ఈశ్వరన్ సినిమాలో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం నడిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. తన ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. “ఒక హీరోయిన్ సినిమాలోకి వచ్చినప్పుడు, ఆమె గురించి చాలా పుకార్లు వస్తాయి. ముఖ్యంగా ఆమె వివాహం గురించి. ఇదంతా సాధారణమే. ఎందుకంటే జనాలు ఎక్కువగా రూమర్స్ పై ఆసక్తి కలిగి ఉంటారు. అది త్వరగా ప్రచారం జరుగుతుంది. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నా గురించి ఎప్పుడూ ఏదోక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శింబుతో తన పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది.
ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీర మల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను జూన్ 12, 2025న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..