సౌత్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తమిళ్ చిత్రపరిశ్రమలో సీనియర్ నటులలో ఒకరైన నటుడు రాజేశ్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గురువారం ఉదయం ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురివకావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. రాజేశ్‌ను పరీక్షించిన వైద్యులు.. ఆయన మార్గమధ్యలోనే మరణించినట్లు తెలిపారు. రాజేశ్ మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపై సినీప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. రాజేశ్.. తమిళ చిత్రపరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించారు. కెరీర్ తొలినాళ్లల్లో హీరోగా పరిచయమైన రాజేశ్.. దాదాపు రెండు తరాల నటీనటులతో కలిసి పనిచేశారు. తెలుగులో ఆనంద భైరవి, రెండు జెళ్ల సీత, సత్య వంటి చిత్రాల్లో నటించారు.
1949లో తిరువారూర్ జిల్లాలోని మన్నర్గుడిలో విలియమ్స్ నట్టర్, లిల్లీ గ్రేస్ దంపతులకు జన్మించారు రాజేశ్. ఆయన కుటుంబం తంజావూరు జిల్లాలోని అనికడు ప్రాంతంలో నివసించింది. రాజేష్ తన పాఠశాల విద్యను దిండిగల్, వడమదురై, చిన్నమనూర్‌తో సహా వివిధ ప్రాంతాలలో పూర్తి చేశారు. కరైకుడిలోని అలగప్ప విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తి చేసిన రాజేశ్.. ఆ తర్వాత చెన్నైలోని పచ్చయ్యప్పన్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత పురసైవాక్కంలోని సెయింట్ పాల్స్ హై స్కూల్‌లో, తిరువల్లికేనిలోని స్కెలిటన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు.
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన రాజేశ్.. 1974లో కె. రాజేష్‌కి బాలచందర్ దర్శకత్వం వహించిన అవల్ ఒరు సాతకథై అనే సీక్వెల్ చిత్రంలో నటించే అవకాశాన్ని సంపాదించుకున్నారు. ఆ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన రాజేశ్.. 1979లో పి.ఎ. బాలగురు దర్శకత్వం వహించిన కన్నిపారువతిలే చిత్రంతో హీరోగా మారారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా మెప్పించిన ఆయన.. నెమ్మదిగా వయసుకు తగిన పాత్రలు పోషించారు. రాజేష్ 1983లో ద్రవిడ నాయకుడు, సంఘ సంస్కర్త పట్టుకోట్టై కళ్యాణసుందరం మనవరాలు జోన్ సిల్వియాను వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజేశ్ భార్య అనారోగ్య సమస్యలతో 2012లో మరణించారు. తమిళంతోపాటు రాజేశ్ తెలుగులోనూ పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‌స్టాప్ సస్పెన్స్..
Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..