
ఎయిర్ కండిషనర్లు ప్రధానంగా 6 మోడ్‌లను కలిగి ఉంటాయని మీకు తెలిసి ఉండవచ్చు. ఇందులో స్లీప్ మోడ్, ఎనర్జీ సేవర్ మోడ్ కూడా ఉన్నాయి. అందుకే స్లీప్ మోడ్ నిజంగా విద్యుత్తును ఆదా చేస్తుందా? అలాగే, స్లీప్ మోడ్ ఎనర్జీ సేవర్ మోడ్ కంటే ఎలా భిన్నంగా ఉంటుందో తెలుసుకుందాం. స్లీప్ మోడ్, ఎనర్జీ సేవర్ మోడ్ మధ్య తేడాను గుర్తించలేకపోవడం వల్ల, రాత్రిపూట ఏసీని ఏ మోడ్‌లో నడపాలో ప్రజలకు అర్థం కాదు. మీకు కూడా అలాంటి గందరగోళం ఉంటే ఏసీలో ఈ రెండు లక్షణాల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.
స్పిపింగ్ మోడ్ అనేది రాత్రిపూట ఉపయోగించేది. ఈ సెట్టింగ్‌లో థర్మోస్టాట్ ఉష్ణోగ్రత గరిష్టంగా 2 గంటల పాటు ప్రతి గంటకు 0.5 లేదా 1 డిగ్రీ పెరుగుతుంది. అదే సమయంలో ఎనర్జీ సేవర్ మోడ్ విద్యుత్తును ఆదా చేయడం కోసం. ఎందుకంటే ఏసీ అనేది ఎక్కువ విద్యుత్తును వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరం. దీని కారణంగా వేసవిలో విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుంటుంది. అందువల్ల బిల్లును తగ్గించడానికి, AC తయారీ కంపెనీలు ACలలో ఈ మోడ్‌ను అందిస్తున్నాయి.
ఏసీ ఎనర్జీ సేవర్ మోడ్‌లో నడుస్తున్నప్పుడు విద్యుత్తును ఆదా చేయడానికి కంప్రెసర్ తరచుగా ఆఫ్ అవుతుంది. మరోవైపు స్లీప్ మోడ్‌లో థర్మోస్టాట్ ఉష్ణోగ్రత ఎక్కువగా సెట్ చేస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. థర్మోస్టాట్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే, విద్యుత్ వినియోగం అంత ఎక్కువగా ఉంటుంది. థర్మోస్టాట్ ఉష్ణోగ్రత అంటే మీరు మీ ACని నడిపే ఉష్ణోగ్రత. ఉదాహరణకు.. మీరు 18℃ వద్ద AC నడిపితే విద్యుత్ బిల్లు ఎక్కువగా ఉంటుంది. మీరు 24℃ వద్ద ఏసీ నడిపితే బిల్లు తక్కువగా ఉంటుంది.
ఎనర్జీ సేవర్ మోడ్, స్లీప్ మోడ్ రెండూ విద్యుత్తును ఆదా చేస్తాయి. స్లీప్ మోడ్ రాత్రిపూట మాత్రమే ఉపయోగించబడుతుంది. అయితే ఎనర్జీ సేవర్ మోడ్‌ను ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఎనర్జీ సేవర్ మోడ్‌లో ACని నడపడం ద్వారా, కంప్రెసర్ తరచుగా ఆపివేయబడటం ద్వారా ఇది కూలింగ్‌ను తగ్గిస్తుంది. అందువల్ల, మీరు ఏసీ పూర్తి ఆనందాన్ని పొందలేరు.
మరోవైపు, మీరు ఏసీని స్లీప్ మోడ్‌లో నడుపుతున్నప్పుడు, థర్మోస్టాట్ ఉష్ణోగ్రత స్వయంచాలకంగా గరిష్టంగా 2°Cకి పెరుగుతుంది. అయితే, రాత్రిపూట బయట ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది మిమ్మల్ని ప్రభావితం చేయదు. ఈ మోడ్‌లను బాగా అర్థం చేసుకోవడానికి, మీరు రెండింటినీ ఒక్కొక్కటిగా పరీక్షించి, మీకు బాగా సరిపోయే దానిపై రాత్రిపూట మీ AC మోడ్‌ను అమలు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి