సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో హీరో ఆర్య ఒకరు. తమిళంతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజారాణి సినిమాతో తమిళం, తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అలాగే కోలీవుడ్ లో ‘అవన్-ఇవాన్’, ‘సర్పట్ట పరంబరై’, ‘నాన్ కడవుల్’, ‘కాదల్ సొల్ల వందేన్’ వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం తెల్లవారుజామునే ఆర్య ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఆర్య పై పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో… ఆయనకు సంబంధించిన రెస్టారెంట్ పై దాడులు చేసి సీజ్ చేసినట్లు సమాచారం. ఆర్యకు ‘సీ షెల్’ అనే హోటల్ రెస్టారెంట్ చైన్ ఉంది. ఈ హోటల్ చైన్ నుండి ఆర్య భారీ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.
అయితే ఈ హోటల్ నుంచి వచ్చే సంపాదన గురించి ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు ఇవ్వలేదని.. అలాగే పన్ను ఎగవేత ఆరోపణలు సైతం రావడంతో అధికారులు ఏకకాలంలోఆ ఆర్య ఇంటితోపాటు సీ షెల్ రెస్టారెంట్ కు సంబంధించిన బ్రాంచులపై సైతం దాడులు నిర్వహించారు. అన్నా నగర్, వేలచ్చేరి, కుట్టివాకం, కిల్పాక్ మరికొన్ని ప్రదేశాలలో ఆర్యకు చెందిన హోటళ్లపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. కొచ్చిలో ఆర్యకు చెందిన కొన్ని ప్రదేశాలు, వ్యాపారాలు, హోటళ్లపై దాడులు జరగడానికి ఇదొక్కటే కారణం కాదని తెలుస్తోంది. ఈ ఉదయం హోటళ్లు తెరవడానికి ముందే పన్ను శాఖ అధికారులు దాడులు చేసి వారి ఖాతాలను తనిఖీ చేస్తున్నారు.
సినిమాలే కాకుండా ఆర్య వ్యాపారరంగంలోనూ రాణిస్తున్నారు. అలాగే ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం ఉంది. ఆర్య ఇప్పటివరకు తమిళం, మలయాళం మొత్తం కలిపి దాదాపు 11 సినిమాలను నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటించారు. ప్రస్తుతం ఆయన మిస్టర్ ఎక్స్, అనంతన్ కడు చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..