సాధారణంగా థ్రిల్లర్, హారర్ సినిమాలు ఒంటరిగా చూడాలంటే చాలా మందికి భయం. కానీ ఈమధ్యకాలంలో ఓటీటీల్లో ఇలాంటి జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో హారర్, మిస్టరీ, థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ క్షణ క్షణం మీకు భయం పుట్టిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులకు గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఇది ఒక సీరియల్ కిల్లర్ కథ. నిజమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సిరీస్ ప్రతి సినీప్రియుడిని కట్టిపడేస్తుంది. అదే ఆటో శంకర్. ఈ కథ సీరియల్ కిల్లర్ గౌరీ శంకర్ జీవితం ఆధారంగా రూపొందించారు.
1970 నుంచి 1980 వరకు చెన్నైలో మొత్తం 18 మంది అమాయకుల ప్రాణాలను తీశాడు. వరుస హత్యలతో చెన్నై ఊలిక్కిపడుతుంది. సజావుగా సాగుతున్న చెన్నై ప్రజల జీవితాల్లో ఈ సీరియల్ కిల్లర్ హత్యలు భయాన్ని కలిగిస్తాయి. ఈ హత్యల వెనుక శంకర్ ఉన్నాడని అనుమానిస్తుంటారు. అతడు నేరాలకు కేరాఫ్ అడ్రస్. అతడిని పోలీసులు ఎలా పట్టుకుంటారు.. ? ఆ హత్యలు శంకర్ ఎందుకు చేశాడు ? అనేది సినిమా. ఇందులో ఆటో శంకర్ పాత్రలో అప్పని శరత్ పోషించారు. ప్రతి క్షణం ప్రేక్షకులకు భయాన్ని పుట్టిస్తోంది ఈ సిరీస్.
ఆటో శంకర్.. అప్పట్లో చెన్నైని హడలెత్తించిన సీరియల్ కిల్లర్. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీసిన ఆటో శంకర్ అంటే అప్పట్లో జనాలు భయంతో వణికిపోయేవారు. అతడి జీవితం ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ప్రస్తుతం ఈ సిరీస్ కు ఐఎండీబీలో 6.7 రేటింగ్ కలిగి ఉంది. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు సస్పెన్స్, థ్రిల్లర్, నిజమైన క్రైమ్ కథలను చూడాలనుకుంటే ఈ సిరీస్ జీ5లో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..