గురువారం ప్రపంచ రక్షకుడైన విష్ణువుకు అంకితం చేయబడినది రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున చాలా మంది ఉపవాసం ఉండి విష్ణువు , లక్ష్మీ దేవిని ప్రార్థిస్తారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా ఆ వ్యక్తికి త్వరలో వివాహం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశాలు ఉంటాయి
గురువారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేసి, ఆపై పసుపు రంగు దుస్తులు ధరించండి. దీని తరువాత ఆచారాల ప్రకారం విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించండి. దీనితో పాటు పూజ సమయంలో విష్ణువు ,లక్ష్మీదేవికి ఏకాక్షి నారికేళం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయను సమర్పించండి. ఇలా ఒంటి కన్ను ఉన్న కొబ్బరి కాయని శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి సమర్పించడం వలన చిన్న వయసులోనే .. లేదా పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టిన వెంటనే వివాహం జరిగే అవకాశం ఏర్పడుతుంది.
జీవితం సంతోషంగా ఉంటుంది. గురువారం రోజున అరటి చెట్టును పూజించడం కూడా చాలా ఫలప్రదం. ఈ రోజున అరటి చెట్టును పూజించడం వల్ల చిన్న వయసులోనే వివాహం జరగడమే కాదు.. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. దంపతుల మధ్య అనురాగం కలకాలం ఉండాలంటే గురువారం నాడు భార్యాభర్తలు కలిసి అరటి చెట్టును పూజించాలి.
ఇవి కూడా చదవండి
గురువారం చేయాల్సిన పరిహారాలు
ఈ రోజున వైష్ణవాలయాన్ని ఆలయాన్ని సందర్శించండి. లేదా దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకుని సింధూరం సమర్పించండి. అలా సమర్పించిన సింధూరాన్ని ప్రసాదంగా తీసుకుని రోజూ నుదుటిన ధరించండి. ఇలా చేయడం ప్రయోజనం చేకూరుస్తుంది.
ఈ మంత్రాలను జపించండి
- వివాహానికి ఆటంకాలు కలుగుతూ ఉంటే.. నివారణ కోసం ప్రతి గురువారం కొన్ని చర్యలు చేయండి. గురువారం రోజున పూజ సమయంలో ఓం గ్రామ్ గ్రిమ్ గ్రోమ్ సః గురువే నమః” అనే గురు మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల వివాహంలో ఉన్న అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి.
- ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని అని జపిస్తూ.. నాకు త్వరగా వివాహం అయ్యేలా చేయి. అంతేకాదు శుభాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ప్రార్ధించండి.
- ఓం శం శంకరాయ నమః ఓం తం తాం తం తాతాయ నమః అని ప్రార్ధిస్తూ తన జన్మజన్మల పాపాలన్నింటినీ నాశనం చేసి.. పురుషార్థం అనే చతుర్విధ ప్రయోజనం కోసం భర్తను ప్రసాదించమని కోరుకోండి.
- ఓం శ్రీం వర ప్రదాయ శ్రీ నమః
- క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అనే మంత్రాలను పటించడం వలన జాతకంలో అడ్డంకులు అన్నీ తోలగి త్వరగా పెళ్లి కుదురుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు