NTR district: ప్రిన్సిపాల్‌పై యాసిడ్ దాడి చేసిన లేడీ టీచర్‌.. ఎందుకంటే..?

NTR district:  ప్రిన్సిపాల్‌పై యాసిడ్ దాడి చేసిన లేడీ టీచర్‌.. ఎందుకంటే..?


ఇప్పటిదాకా యువతులపై యువకుల యాసిడ్ దాడి ఘటనలు చూశాం. కానీ ఎన్టీఆర్‌జిల్లా గుంటుపల్లిలో సీన్ రివర్సయింది. ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌పై ఓ లేడీ టీచర్ యాసిడ్ దాడికి దిగింది. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.

లేటీ టీచర్‌పై విద్యార్థుల ఫిర్యాదు

లేడీ టీచర్ బాధితుడు ఇతనే. పేరు విజయ్ ప్రకాష్‌. ఓ ప్రైవేట్ స్కూల్‌కి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. తాను స్టిక్ట్‌గా ఉండటమే కాదూ.. పిల్లలూ అలాగే ఉండాలని పట్టుబడుతంటాడు. అందుకే ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందిస్తాడు. ఈ క్రమంలోనే స్కూల్‌లో పనిచేస్తున్న లేడీ టీచర్‌పై విద్యార్థులంతా కంప్లయింట్‌లు ఇచ్చారు. తమను ఇష్టానుసారంగా కొడుతుందని. కారణం లేకుండా పనిష్‌మెంట్ ఇవ్వడమేంటని కంప్లయింట్‌లో ప్రశ్నించారు.

కేబిన్‌లోకి వెళ్లి ప్రిన్సిపాల్‌పై యాసిడ్ దాడి

ఒకరిద్దరు కాదూ.. చాలామంది నుంచి అవే ఫిర్యాదులు రావడంతో ప్రిన్సిపల్‌ విజయ ప్రకాష్‌ యాక్షన్‌కు రెడీ అయ్యాడు. లేడీ టిచర్‌ను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిందా టీచర్‌. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. విజయ్ ప్రకాష్‌తో మాట్లాడే పని ఉందంటూ స్కూల్‌కి వెళ్లింది. నేరుగా  ప్రిన్సిపాల్‌ రూమ్‌కి వెళ్లి… మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ యాసిడ్ దాడి చేసింది.

గతంలో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా?

ప్రిన్సిపాల్ అరుపులు కేకలు వేయడంతో సిబ్బంది అలర్టయ్యారు. కిందపడిపోయిన విజయ్‌ ప్రకాష్‌ను గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. అయితే యాసిడ్‌ పవర్‌ఫుల్ కాకపోవడంతో ప్రిన్సిపాల్‌కు బలమైన గాయాలు కాలేదు. ప్రస్తుతం అయనకు డాక్టర్లు చికిత్సనందిస్తున్నారు. కేవలం స్టూడెంట్స్‌ ఫిర్యాదు చేశారనే ప్రిన్సిపాల్‌పై టీచర్ దాడి చేసిందా..? ఇద్దరి మధ్య గతంలో ఏమైనా వ్యక్తిగత విభేదాలున్నాయా? పోలీసులు మాత్రం త్వరలోనే అసలు నిజాలు బయటపెడతామన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *