హిందూ మతంలోని మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణం జననం, మరణం, మరణానంతర ప్రపంచం గురించి వివరిస్తుంది. విష్ణువు, పక్షి రాజు గరుడకి మధ్య జరిగిన సంభాషణ గరుడ పురాణంలో వివరించబడింది. గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన కర్మలను బట్టి స్వర్గం, నరకం లేదా మోక్షాన్ని పొందుతాడని స్పష్టంగా చెప్పబడింది. మనిషి తన మంచి, చెడు కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. గరుడ పురాణంలో కూడా ఒక వ్యక్తి పాత్ర గురించి సమాచారం ఇవ్వబడింది. జీవితాంతం నీచమైన పనులు చేస్తూ గడిపే స్త్రీ పురుషులు నరక యాతనలను అనుభవించవలసి ఉంటుంది. వారి తదుపరి జన్మలో వింతైన, విషపూరిత జీవుల గర్భం నుంచి కొత్త జీవితాన్ని పొందాల్సి ఉంటుంది.
గరుడ పురాణం ప్రకారం.. స్త్రీని లైంగికంగా దోపిడీ చేసే పురుషుడు మరణాంతరం ఆత్మ నరకానికి చేరుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో.. అటువంటి దుష్ట ఆత్మ తదుపరి జన్మ పొందినప్పుడు.. కొండచిలువ నుంచి జన్మించాల్సి వస్తుంది.
తమ గురువు భార్యతో శారీరక సంబంధం కలిగి ఉన్న పురుషులు అంటే తమ గురు మాతపై చెడు దృష్టి కలిగి ఉన్నవారు లేదా ఆమెతో శారీరక సంబంధం కలిగి ఉన్నవారు.. మరణం తరువాత.. తదుపరి జన్మలో తొండగా పుడతారు.
ఇవి కూడా చదవండి
గరుడ పురాణం ప్రకారం తమ స్నేహితుడి భార్యపై చెడు దృష్టి కలిగి ఉన్నా.. స్నేహితుడి భార్యతో శారీరక సంబంధం పెట్టుకునే పురుషులు నరకంలో అతిదారుణమైన హింసను అనుభవించడమే కాదు వారి తదుపరి జన్మలో గాడిదగా పుడతారు.
గరుడ పురాణం ప్రకారం స్త్రీలను గౌరవించని పురుషులు, స్త్రీలను కొట్టి హింసించే పురుషులు, స్త్రీలను వేధించే పురుషులు మరణానంతరం నరకం అనుభవించాల్సి ఉంటుంది. తదుపరి జన్మలో అటువంటి పురుషుల ఆత్మ నపుంసకుడిగా పుడుతుంది.
అదే విధంగా వివాహిత స్త్రీలు పరాయి పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకుంటే అటువంటి స్త్రీ ఆత్మకు నరకంలో చోటు లభిస్తుంది. అక్కడ రకరకాల హింస అనుభవించిన తర్వాత,.. స్త్రీ తదుపరి జన్మ పొందినప్పుడు బల్లి, పాము లేదా గబ్బిలం గా జన్మలభిస్తుంది.
అటువంటి పరిస్థితిలో.. నరక హింసల నుంచి తప్పించుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి లేదా మానవ రూపంలోకి తిరిగి జన్మించేందుకు ఆ జీవిగా జన్మించి జీవితాంతం మంచి పనులు చేయాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు