కొందరి పేర్లను కలిపి వింటేనే అదో రకం ఆనందంగా ఉంటుంది. బాలీవుడ్లో అలాంటి పేర్లు ఆమీర్ – రాజ్ కుమార్ హిరానీ. వారిద్దరి కాంబో మేజిక్ క్రియేట్ చేస్తుందని హ్యాపీగా ఫీలవుతుంటారు ఫ్యాన్స్. మరోసారి మిరాకిల్ చేయడానికి వీరిద్దరూ చర్చలు షురూ చేశారన్నది ఇంట్రస్టింగ్ న్యూస్.
2009లో ఆమిర్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ కలిసి సృష్టించిన వండర్ త్రీ ఇడియట్స్. అప్పటిదాకా ఉన్న ఫిల్మ్ మేకింగ్‌ని రీ డిఫైన్ చేసింది ఈ సినిమా ని ఇప్పటికీ ప్రశంసిస్తుంటారు క్రిటిక్స్. సరిహద్దులు దాటి అంతలా జనాలను అట్రాక్ట్ చేసిందా సినిమా.
మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే బావుంటుందని అందరూ అనుకుంటున్న సమయంలో.. వచ్చిందే పీకే. పబ్లిసిటీ నుంచి ప్రతి విషయంలోనూ ట్రెండ్‌ని సృష్టించి సూపర్ హిట్ అందుకున్నారు.
దశాబ్దం దాటిన తర్వాత ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారన్నది ముంబై న్యూస్. జీవితానికి సంబంధించిన సెన్సిటివ్ విషయాలను హ్యూమర, ఎమోషన్స్ మేళవించి చెప్పనున్నారన్నది ఆల్రెడీ లీక్ అయిన మేటర్.
డంకీ తర్వాత ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నారట రాజ్ కుమార్ హిరానీ. ఆమిర్ సినిమాను వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయని, మిగిలిన డీటైల్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తారని టాక్.