Bellamkonda Srinivas: షాకింగ్.. హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీస్ కేసు.. ఏం జరిగిందంటే?  

Bellamkonda Srinivas: షాకింగ్.. హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీస్ కేసు.. ఏం జరిగిందంటే?   


టాలీవుడ్ హీరో బెల్లంకొండ తెలుగు సినిమాల్లో కనిపించక సుమారు నాలుగేళ్లవుతోంది. ఈ గ్యాప్ ను పూరించేలా అతను భారీ మల్టీ స్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భైరవం. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్నీ భైరవం సినిమా మే 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటోంది. అయితే ఇంతలోనే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అనవసరంగా ఓ వివాదంలో ఇరుకున్నాడు. ఇప్పుడు అతనిపై పోలీస్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ శ్రీనివాస్‌ మంగళవారం (మే13) మధ్యాహ్నం కారులో జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–45 వైపు నుంచి జర్నలిస్ట్‌కాలనీ వరకు వచ్చి చౌరస్తాలో రాంగ్‌రూట్‌లో తన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నరేష్‌ హీరో కారును గమనించి అడ్డుకున్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్‌ సదరు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడి పైకి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది. దీంతో కానిస్టేబుల్‌ కూడా భయంతో పక్కకు తప్పుకున్నాడని సమాచారం.

ఈ తతంగాన్నంతా ఒక వాహన దారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు బెల్లంకొండ శ్రీనివాస్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతున్నారు. సెలబ్రిటీలై ఉండి ఇలా ప్రవర్తిస్తారా? అంటూ హీరోను విమర్శిస్తున్నారు. కాగా ఇప్పుడిదే ఘటనలో జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం (మే15) బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. ఆయన మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడా? లేదా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ విషయమై శ్రీనివాస్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

భైరవం సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *