ఇవి కూడా చదవండి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఓ సినిమాతో బిజి బిజీగా ఉంటున్నాడు. అంతకంటే ముందు తారక్ నటించిన ‘వార్ 2’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. దీంతో పాటు దేవర 2 కూడా ఎన్టీఆర్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇంతలోనే తారక్ మరో కొత్త సినిమాకు పచ్చజెండా ఊపాడని ప్రచారం జరుగుతోంది. అది కూడా ది గ్రేట్ లెజెండ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే లో తారక్ నటిస్తున్నాడని తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇదొక పవర్ ఫుల్ బయోపిక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే భారత దేశంలో సినిమా పుట్టుకకు దాదాసాహెబ్ ఫాల్కేనే కారణం. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ, మాక్స్ స్టూడియో వరుణ్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు గురించి రాజమౌళి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు జరిపాడని టాక్. ఎన్టీఆర్ కూడా ఇందులో నటించడానికి ఆసక్తి చూపించాడని సమాచారం.
దాదాసాహెబ్ ఫాల్కే జీవితాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలికైన పని కాదు. ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా మాస్ చిత్రాల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఇప్పుడు దాదా సాహెబ్ పాల్కే లాంటి పాత్రలో ఎన్టీఆర్ ను అభిమానులు చూస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఈ బయోపిక్ నిర్మించేందుకు ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని సమాచారం. దీనికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.
దాదాసాహెబ్ ఫాల్కే 1870లో జన్మించారు. ఆయన మొదటి పేరు దుండిరాజ్ గోవింద ఫాల్కే. 1903లో, ఆయన పురావస్తు శాఖలో ఫోటోగ్రాఫర్‌గా చేరారు. 1910లో ‘లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ అనే సినిమా చూసిన తర్వాత ఆయన సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అలా 1913లో, ఆయన ‘రాజా హరిశ్చంద్ర’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి పూర్తి నిడివి సినిమా. ఆ తర్వాత ఆయన 95 సినిమాలు తీశారు. తన మొదటి సినిమా తీయడానికి తన ఆస్తినంతా అమ్మేశారు దాదా సాహెబ్. భారతీయ సినిమా పరిశ్రమ ఉన్నంతవరకు దాదా సాహెబ్ పాల్కే పేరు వినిపిస్తుంటుంది. భారత ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఏటా అవార్డులు అందజేస్తోంది.
వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ లుక్..
Jr NTR will star in Made In India, a biopic on Dadasaheb Phalke, the father of Indian cinema. Presented by SS Rajamouli and directed by National Award-winner Nitin Kakkar, the film impressed Jr NTR with its rich detailing, leading him to take on the role. Slated for a pan-India… pic.twitter.com/FAqczhrLUb
— SIIMA (@siima) May 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..