Karnataka: తండ్రిని హత్య చేసి కరెంట్‌ షాక్‌గా చిత్రీకరించాడు.. కట్‌చేస్తే.. ఊహించని షాక్!

Karnataka: తండ్రిని హత్య చేసి కరెంట్‌ షాక్‌గా చిత్రీకరించాడు.. కట్‌చేస్తే.. ఊహించని షాక్!


కార్ణాటక రాష్ట్రానికి  చెందిన ఐస్‌క్రీం ఫ్యాక్టరీ వ్యాపారి నగేష్ మృతి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి చూసింది. నగేష్‌ను అతని కన్న కొడుకే హత్య చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం.. కార్నాటక రాష్ట్రంలోని తిమ్మసంద్రకు చెందిన నగేష్, చాలా సంవత్సరాలుగా కునిగల్‌లోని శివాజీ టెంట్ రోడ్డులో ఓ ఐస్ క్రీం ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. అయితే, మే 10వ తేదీన నగేష్ అకస్మాత్తుగా మరణించాడు. అయితే అతను విద్యుత్‌ షాక్‌తో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారన చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలో సీసీటీవీని పరిశీలించిన పోలీసులు అతని కొడుకే తన ఫ్రెండ్స్ తో కలిసి తండ్రిని హత్య చేశాడనే షాకింగ్ విషయాన్ని తెలుసుకున్నారు.

ఐస్‌క్రీం ఫ్యాక్టరీ నడుపుతూ జీవనం సాగిస్తున్న నగేష్ వివాధాల కారణంగా తన మొదటి భార్యను విడిచిపెట్టాడు. ఆ తర్వాత, మరో మహిళను పెళ్లి చేసుకుని, తన స్వస్థలాన్ని వదిలి కునిగల్‌లో స్థిరపడ్డాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నగేష్‌కు ఓ కూతురితో పాటు డిగ్రీ చదువుతున్న కొడుకు కూడా ఉన్నాడు. అయితే, కొంత కాలంగా తండ్రి కొడుకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మే 10న, తన స్నేహితులతో కలిసి ఐస్‌క్రీం ఫ్యాక్టరీకి వచ్చిన సూర్య తండ్రితో గొడవ పడ్డాడు. అతనిపై దాడి చేసి, ఆపై గుడ్డతో గొంతు నులిమి హత్య చేశారు.

అయితే తండ్రి హత్యపై ఎవరికీ అనుమానం రాకుండా విద్యుత్‌ షాక్‌తో మరణించినట్టు అతనికి చేతికి కరెంట్‌ వైర్‌ను తగిలించాడు. అయితే స్నేహితులతో కలిసి సూర్య.. తండ్రిని కొట్టి చంపిన దృశ్యాలన్నీ ఫ్యాక్టరీ లోపల ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోలను పరిశీలించిన పోలీసులు కొడుకు సూర్యపై కేసు నమోదు చేసి.. అతన్ని అరెస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *