ఏప్రిల్ నెల ముగియనుంది. మే నెల వస్తోంది. రేపు గురువారం బ్యాంకులకు సెలవు ఉంటుందా? మే 1, 2025న దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. దీని అర్థం కస్టమర్లు గురువారం బ్యాంకుకు వెళ్లి తమ పనిని పూర్తి చేసుకోలేరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 మే 2025న సెలవు ఎందుకు ప్రకటించిందో, ఏ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.
అయితే మే 1వ తేదీన బ్యాంకులు ఏ రాష్ట్రాల్లో మూసి ఉంటాయి..? బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా మరియు తిరువనంతపురం వంటి నగరాల్లో మహారాష్ట్ర దినోత్సవం, మేడే సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్, లేదా RBI, ప్రతి నెలా బ్యాంకు సెలవులను నిర్ణయిస్తుంది. అయితే, బ్యాంకు సెలవులు రాష్ట్ర, కేంద్ర మండలాలను బట్టి ఉంటాయి.
ఈ సెలవు దినాలలో బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ వినియోగదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. UPI, IMPS, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ల వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా పనిచేస్తాయి. వినియోగదారులు నిధుల బదిలీలు, బిల్లు చెల్లింపులు, ఇతర లావాదేవీలను నిర్వహించవచ్చు. సెలవు దినాలలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి వినియోగదారులు తమ బ్యాంకు శాఖకు సంబంధించిన పనిని చాలా ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి