ప్రస్తుత కాలంలో డబ్బులు సంపాదించడం చాలా కష్టం.. అదే సమయంలో కొంచెం తెలివి తేటలు.. ప్రత్యేకమైన ప్రతిభ ఉంటే చాలు చాలా సులభంగా డబ్బు సంపాదించవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి అనేక ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రజలు తమ ప్రతిభను ఉపయోగించుకుని భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి ఒక యువతి కథ ప్రస్తుతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఈ స్త్రీ పురుషులను అవమానించడం ద్వారా డబ్బు సంపాదిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పురుషులు కూడా ఆ యువతి చేస్తున్న అవమానాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఆ యువతి పేరు టైఫనీ శాంటోస్. 30 ఏళ్ల టైఫనీ శాంటోస్ పురుషులను అవమానించడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఇతరులతో షేర్ చేస్తుంది కూడా. ఈ మహిళ గురించి నీడ్ టు నో వెబ్‌సైట్‌లో ఒక వార్త ప్రముఖంగా ప్రచురించింది. దాని ప్రకారం టిఫనీ పురుషులను అవమానిస్తుంది. దీనికి ఆమె డబ్బు వసూలు చేస్తుంది. వాస్తవానికి పురుషులకు అందమైన, ధైర్యవంతురాలైన స్త్రీ చేత వేధింపులకు గురికావాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అది కాలక్రమేణా ఒక వ్యామోహంగా మారుతుంది.
యువతి డబ్బు సంపాదించే విధానం ఇదే..
కొంతమంది పురుషులు తమ వ్యామోహాన్ని తీర్చుకోవడానికి టిఫనీకి డబ్బు ఇస్తారు. ఇటీవల టైఫనీ శాంటోస్ తన ఫోటోను షేర్ చేసింది. అందులో ఒక వ్యక్తి టిఫనీని కుక్కలా మెడలో కట్టుకుని రోడ్డుపైకి నడిపించమని అభ్యర్థించాడు. దీని కోసం ఆమె వింతైన బట్టలు ధరించింది. తరువాత టిఫనీ ఒక తాడు పట్టుకుని రోడ్డుపై నడుస్తూ వెళ్ళింది. ఈ ఫోటో ప్రజలలో వైరల్ అయినప్పుడు.. అందరూ ఆశ్చర్యపోయారు.
ఇవి కూడా చదవండి
ప్రజల వింత డిమాండ్లను తీర్చడానికి టిఫనీ రూ. 8 లక్షల నుంచి రూ. 17 లక్షల వరకు వసూలు చేస్తుంది. చాలా మంది అభిమానులు తమ ఊహలను తనతో పంచుకుంటారని.. తాను వాటిని నెరవేర్చి డబ్బు సంపాదిస్తున్నానని టిఫనీ చెబుతోంది. అయితే తనకు సమస్య కలిగించే ప్రజల డిమాండ్లను తాను ఎప్పుడూ అంగీకరించనని చెప్పింది. ఈ యువతి చెప్పిన విషయం తెలిసిన తర్వాత చాలా మంది టిఫనీని ప్రశంసిస్తుండగా.. ఈ విధంగా ఎవరైనా డబ్బు ఎలా సంపాదిస్తారు? అసలు ఇలాంటి ఇడియాలు ఎలా వస్తాయి అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.