తెలుగు సినీ ప్రియులకు నటి రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. అగ్ర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న రాధిక ఇప్పుడు సహయక నటిగా మెప్పిస్తున్నారు. యంగ్ హీరోహీరోయిన్లకు అమ్మగా, అత్తగా నటిస్తున్నారు. అంతేకాదు రాజకీయాల్లోనూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాధిక పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలుసు.
కానీ చాలా మందికి తెలియని ఓ విషయం ఉంది. ఆమె అల్లుడు ఒక టీమిండియా క్రికెటర్. అతడే అభిమన్యు మిథున్. కర్ణాటక క్రికెటర్ అభిమన్యు మిథున్ దక్షిణాఫ్రికా 2009-10 టెస్ట్ సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. అలాగే 2010లో అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా తో మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశాడు. టీమిండియా తరపున మొత్తం 4 టెస్టులు, 5 వన్డేలు ఆడిన అభిమన్యు మిథున్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 9.3 వికెట్స్ తీశాడు. ఐపీఎల్ 2009 సీజన్ లో ఆర్సీబీ తరపున ఆడాడు.
రాధిక శరత్ కుమార్ కూతురు రేయన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం 2016 ఆగస్ట్ 28న ఘనంగా జరిగింది. వీరికి కూతురు రాయనే హార్డీ, కుమారుడు రాహుల్ శరత్ కుమార్ ఉన్నారు. రాధికకు తన రెండో భర్త, బ్రిటిష్ జాతీయుడు రిచర్డ్ హార్డీ దంపతులకు రేయన్ జన్మించింది. అతడి నుంచి విడిపోయిన తర్వాత రాధిక 2001లో నటుడు శరత్ కుమార్ ను వివాహం చేసుకుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..
Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..
Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..