తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశికి ఆరవ స్థానంలోకి శని ప్రవేశించడం వల్ల అనేక సమస్యలు, వివాదాలు క్రమంగా తగ్గు ముఖం పట్టడం ప్రారంభం అవుతుంది. అనారోగ్యాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. స్థిరాస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి.