ఈమధ్య కాలంలో హారర్ సినిమాలంటే క్రేజ్ పెరుగుతుంది. అందుకే హారర్, థ్రిల్లర్ జానర్ సినిమాలు ఎక్కువగా రూపొందిస్తున్నారు మేకర్స్. హారర్ సినిమాలు ఇష్టపడుతున్నవారికి ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే. అత్యంత శాపగ్రస్తమైన చిత్రం అని కూడా పిలువబడే ప్రమాదకరమైన భయానక చిత్రం. ఈ భయానక సినిమాను చూస్తున్నప్పుడు ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. కొందరు థియేటర్లలో చాలా మంది వాంతులు చేసుకున్నారు. సెట్ మంటల్లో చిక్కుకుని ప్రజలు మరణించారు. అందుకే ఈ సినిమా వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ హారర్ సినిమాని అత్యంత శపించబడిన సినిమా అని పిలుస్తారు. ఈ శాపగ్రస్తమైన హారర్ సినిమా పేరు ‘ది ఎక్సార్సిస్ట్’. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు చూసి ఈ సినిమా అత్యంత శాపగ్రస్తమైన సినిమాలలో ఒకటిగా నిలిపాయి.
1973లో విడుదలైన ‘ది ఎక్సార్సిస్ట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసింది. సినిమా చూస్తున్నప్పుడు చాలా మందికి తలతిరగడం, వాంతులు కావడం, ఆసుపత్రిలో చేరడం వంటివి ఎదురయ్యాయి. ఒకరోజు రాత్రి సినిమా షూటింగ్ జరుగుతుండగా, స్టూడియోలో అకస్మాత్తుగా పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. మొత్తం సెట్ మంటల్లో కాలిపోయింది. కానీ ఇందులో రీగన్ (లిండా బ్లెయిర్) బెడ్ రూమ్ సెట్ అస్సలు దెబ్బతినలేదు. చిత్రీకరణ సమయంలో ప్రధాన నటి ఎల్లెన్ బర్స్టిన్ తీవ్రంగా గాయపడింది. . ఆ సినిమాలో భూతవైద్యుడి పాత్ర పోషించిన వ్యక్తికి వాస్తవానికి ‘దెయ్యం’ పట్టిందని పుకార్లు వ్యాపించాయి. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అకస్మాత్తుగా అస్వస్థత అనిపించడం మొదలైంది. కొంతమందికి గుండె దడ, వాంతులు, గుండెపోటు కూడా వచ్చాయి.
ఇదంతా పక్కన పెడితే.. ది ఎక్సార్సిస్ట్ 10 ఆస్కార్ నామినేషన్లు పొందిన మొదటి భయానక చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం రెండు ఆస్కార్ అవార్డులు, నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా ఎన్నో వసూళ్ల రికార్డులను కూడా బద్దలు కొట్టింది.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..