పెరుగుతున్న ఊబకాయం కారణంగా, పిల్లలు మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు.. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని నివేదికలో తెలిపారు. ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే.. పిల్లలు ఎందుకు ఊబకాయంతో బాధపడుతున్నారు.. దీనిని ఎలా నియంత్రించవచ్చు..? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం! ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయం రేటు 1990తో పోలిస్తే 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగిందని అంచనా. భారతదేశంతో సహా అనేక దేశాలలో పిల్లలలో ఊబకాయం పెరిగింది. దీని కారణంగా, పిల్లలలో టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బుల కేసులు కూడా పెరిగాయి. కొన్ని సందర్భాల్లో, పిల్లలు గుండె జబ్బుల కారణంగా మరణించిన సంఘటనలూ ఉన్నాయి. ఊబకాయం కారణంగా పిల్లలలో హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతోందంటున్నారు. పిల్లల జీవనశైలి క్షీణించడం ఊబకాయానికి ఒక ప్రధాన కారణమని వైద్యనిపుణులు వివరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడిన బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపుల దగ్గర భారీగా క్యూ
తాడేపల్లిలో వింత జంతువు ప్రత్యక్షం.. దాన్ని చూసి భయపడిన స్థానికులు
ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్! మరి రిషబ్ శెట్టి జై హనుమాన్ సంగతేంటంటే?
100 రోజుల్లో ప్రెగ్నెంటే టార్గెట్ ! నవ్విస్తూనే.. ఆలోచింపచేస్తున్న టీజర్
హీరోగా 10 సినిమాల్లో ఫెయిల్.. కట్ చేస్తే 1200కోట్లకు సంపాదన!