కడలూరు జిల్లాకు చెందిన సుందరమూర్తికి కలైయరసన్ అనే కుమారుడు ఉన్నాడు. జనవరి 26న పెద్దలు అతనికి ఓ యువతితో వివాహం చేశారు. అయితే ఆమెకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. తల్లిదండ్రులు పట్టుబట్టడం వల్లే ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకుంది. ఆమె పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించినట్లు సమాచారం. అయితే ఫస్ట్ నైట్ రోజు ఆమె తన ప్రియుడితో వీడియో కాల్ చేయడంతో కలైయరసన్ షాక్ అయ్యాడు. కుమార్తెను మందలించమని చెప్పి పుట్టింటికి పంపాడు. పుట్టింటివారు మళ్లీ సర్దిచెప్పి అత్తారింటికి పంపారు. అయితే తన ప్రేమికుడితో ఎడబాటును తట్టుకోలేకపోయిన సదరు మహిళ.. ఫిబ్రవరి 20వ తేదీన సాఫ్ట్ డ్రింక్‌లో విషం కలిపి.. భర్త కలైయరసన్‌కు ఇచ్చింది. దీంతో అతను ఇప్పుడు చావుబ్రతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కడలూరులోని పుదుచత్తారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వెంటనే ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలైయరసన్ తల్లిదండ్రులు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో…
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు వీడియో
వామ్మో.. ఈ పాక్ యువతి సంపాదన చూస్తే షాకవుతారు నెలకు ఎంతంటే?వీడియో