దిన ఫలాలు (మార్చి 5, 2025): మేష రాశి వారికి ఈ రోజు వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారడం వల్ల పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభి స్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రుల్లో కొందరు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకం చూరగొంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో చాలావరకు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఎవరికీ ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలతో పాటు పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం చాలావరకు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. జీతభత్యాల విషయంలో అధికారుల నుంచి శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తేలికగా విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిదానంగా, నిలకడగా సాగుతాయి. కొద్ది ప్రయత్నంతో కొన్ని ముఖ్య మైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తప్పకుండా ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
అర్ధాష్టమ శని కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఆశాభంగం కలిగిస్తాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సహోద్యోగులకు ఆశించిన సహాయ సహకారాలు అంది స్తారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ప్రస్తుతానికి ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రోజంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్ది పాటి లాభాలు గడిస్తారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా గట్టెక్కుతారు. ఉచిత సహాయాలు, వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆర్థిక విషయాల్లో వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.