గుండె ఆరోగ్యానికి అవిసె గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు..! వీటిని మిస్సవ్వకండి..!

గుండె ఆరోగ్యానికి అవిసె గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు..! వీటిని మిస్సవ్వకండి..!


అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లిగ్నాన్స్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ప్రతి టేబుల్‌స్పూన్‌ అవిసె గింజల్లో 1.6 గ్రాముల ఒమేగా-3లు, 2 గ్రాముల ఫైబర్, 0.3 మి.గ్రా లిగ్నాన్స్ ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేసేలా కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రక్తపోటును నియంత్రించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, మంటను తగ్గించడం లాంటి ప్రయోజనాలను అందిస్తాయి.

కొలెస్ట్రాల్‌

అవిసె గింజలలో అధికంగా ఉండే ఒమేగా-3లు, ఫైబర్ LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ధమనుల్లో ఫ్లాక్ ఏర్పడకుండా నిరోధించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అధిక రక్తపోటు

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నాన్స్‌లు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి.

శరీరంలో మంట

అవిసె గింజలలోని ఒమేగా-3లు శరీరంలోని మంటను తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చు. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడటంతో గుండె ఆరోగ్యం దృఢంగా ఉంటుంది.

ధమనుల రక్షణ

అవిసె గింజలలో అధికంగా ఉండే ఫైబర్, లిగ్నాన్స్ ధమనులను మృదువుగా ఉంచి గట్టిపడకుండా కాపాడతాయి. ఇవి అథెరోస్క్లెరోసిస్ (ధమనుల గట్టిపడే సమస్య) ముప్పును తగ్గించి గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

డయాబెటిస్

ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదిగా ఉంచి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా ప్రయోజనకరం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా సహాయపడుతుంది.

రక్త ప్రసరణ

అవిసె గింజలలో మెగ్నీషియం పుష్కలంగా ఉండటంతో రక్తనాళాల సడలింపు జరుగుతుంది. సరైన రక్త ప్రసరణ కోసం ఇవి చాలా ఉపయోగపడతాయి. గుండె ఒత్తిడి తగ్గి, రక్తపోటు అదుపులో ఉంటుంది.

గుండె ఆరోగ్యం

ఒక టేబుల్‌స్పూన్‌ అవిసె గింజల ద్వారా 1.6 గ్రాముల ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA) అందుతుంది. ఇది మొక్కల ఆధారిత ఒమేగా-3 కొవ్వు ఆమ్లం, ఇది గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అధిక బరువు

అవిసె గింజలలోని అధిక ఫైబర్, ప్రోటీన్ తక్కువ సమయంలో తృప్తి కలిగించడంలో సహాయపడతాయి. ఇది అనవసరంగా అధికంగా తినకుండా నిరోధించడంతోపాటు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.

ఆక్సీకరణ ఒత్తిడి

అవిసె గింజలలో లిగ్నాన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా రక్తనాళాల క్షీణత నివారించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *