RRB Exam Date: ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాల పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే?

RRB Exam Date: ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాల పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే?


హైదరాబాద్‌, ఫిబ్రవరి 19: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, మెటీరియల్‌ సూపరిటెండెంట్‌, కెమికల్‌ అండ్‌ మెటలార్జికల్‌ అసిస్టెంట్‌, కెమికల్‌ సూపర్‌వైజర్‌, మెటలార్జికల్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల (సీబీటీ-II) విధానంలోనే జరుగుతాయి. ఈ పరీక్షలన్నీ మార్చి 19, 20వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ మేరకు గమనించాలని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది. అలాగే పరీక్ష సెంటర్‌ వివరాలు పరీక్షకు పది రోజుల ముం

RRB పరీక్ష తేదీల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పటినుంచంటే?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో)- 2024 ప్రిలిమినరీ పరీక్ష తేదీలను తాజాగా విడుదల చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలు మార్చి 3, 16, 24 తేదీల్లో జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. పీవోగా ఎంపికైన అభ్యర్ధులకు రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ నెల 25 నుంచి శాతవాహన వర్సిటీ ఫార్మసీ పరీక్షలు

తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్‌) 7వ, 8వ సెమిస్టర్‌ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎస్‌యూ పరీక్షల నియంత్రణాధికారి ఎన్‌వీ శ్రీరంగ ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 5వ, 6వ సెమిస్టర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *