పై ఫొటోలో కనిపిస్తోన్న పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి టాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ. అలాగనీ ఆమె స్టార్ హీరోయిన్. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో సతీమణి. ఈ బ్యూటీ ఇంట్లో అందరికీ సినిమాలతో సంబంధం ఉంది. కనీ ఆమె మాత్రం సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపదు. స్టార్ హీరో భార్య అయినప్పటకీ ఎంతో సింపుల్ గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన భర్త, పిల్లల గురించి ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. మరి ఇంతకీ ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు నందమూరి టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లక్ష్మీ ప్రణతి మనవరాలు అవుతుంది. చంద్రబాబు నాయుడు మేనకోడలు కూతురే లక్ష్మీ ప్రణతి. ఇక 2011లో తారక్-ప్రణతికి పెళ్లయింది. వీళ్లకు అభయ్ రామ్, భార్గవ రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.
లక్ష్మీ ప్రణతి 1992 మార్చి 18న హైదరాబాద్లో జన్మించంది. తండ్రి నార్నె శ్రీనివాసరావు బిజినెస్ మాన్. ఒక ప్రైవేటు టీవీ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. తల్లి పేరు మల్లికా గృహిణి. ఇక లక్ష్మి ప్రణతికి ఒక తమ్ముడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అతని పేరు నార్నె నితిన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో నార్నే నితిన్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
భార్య లక్ష్మీ ప్రణతిలో జూనియర్ ఎన్టీఆర్..
ఇక సినిమాల విషయానికి వస్తే.. దేవర తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఇటీవల వార్ 2 సినిమాతో మన ముందుకు వచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.
నార్నే నితిన్ ఎంగేజ్ మెంట్ వేడుకల్లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.