వారెవ్వా.. మనిషి రోగాన్ని క్షణాల్లో చెప్పేస్తున్న కుక్కలు.. స్టార్టప్ అద్భుత ఘనత..

వారెవ్వా.. మనిషి రోగాన్ని క్షణాల్లో చెప్పేస్తున్న కుక్కలు.. స్టార్టప్ అద్భుత ఘనత..


వారెవ్వా.. మనిషి రోగాన్ని క్షణాల్లో చెప్పేస్తున్న కుక్కలు.. స్టార్టప్ అద్భుత ఘనత..
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

కుక్కలు ప్రత్యేక శక్తులు కలిగి ఉంటాయి. కుక్కలకు మానవుల కంటే వేల రెట్లు ఎక్కువ వాసన శక్తి ఉంటుంది. వాసనను బట్టి అవి మనుషల్ని గుర్తు పట్టగలదు. వాటి వాసనను గ్రహించడం మానవులకు కష్టం. వాటికి సహజమైన, శక్తివంతమైన సెన్సార్ ఉంటుంది. క్రిమినల్ కేసుల్లో హంతకులను పట్టుకోవడానికి కుక్కలను ఉపయోగిస్తారు. బాంబులు, మృతదేహాలు, మాదకద్రవ్యాలు మొదలైన వాటిని గుర్తించడంలోనూ కుక్కలది కీలక పాత్ర. ఇదే సూత్రాన్ని ఉపయోగించుకుని, ‘డాగ్నోసిస్’ సంస్థ, కుక్కల వాసనను రోగ నిర్ధారణకు ఉపయోగిస్తోంది.

బెంగళూరుకు చెందిన డాగ్నోసిస్ అనే స్టార్టప్.. క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులను గుర్తించడానికి ఒక అద్భుతమైన పద్ధతిని అభివృద్ధి చేసింది. ఈ పద్ధతిలో కుక్కల అసాధారణమైన వాసన గ్రహించే శక్తిని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానించారు. దీంతో ప్రారంభదశలోనే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. డాగ్నోసిస్ యంత్రం క్యాన్సర్‌ను మాత్రమే కాకుండా కుక్కల ద్వారా కోవిడ్, క్షయవ్యాధి వంటి వ్యాధులను కూడా గుర్తించగలదు.

కుక్క వ్యాధిని ఎలా గుర్తిస్తుంది?

ఈ పద్ధతిలో పరీక్ష చేయవలసిన వ్యక్తికి 10 నిమిషాల పాటు ఒక ప్రత్యేకమైన మాస్క్‌ను ధరిస్తారు. ఈ సమయంలో అతని శ్వాస ద్వారా వివిధ రసాయనాలు మాస్క్‌కు అంటుకుంటాయి. ఈ మాస్క్‌ను ‘డాగ్నోసిస్’ ల్యాబ్‌కు పంపి, అక్కడ శిక్షణ పొందిన కుక్కలకు వాసన చూపిస్తారు. శిక్షణ పొందిన కుక్కకు ఒక ప్రత్యేకమైన EEG హెడ్‌సెట్ అమర్చుతారు. ఈ హెడ్‌సెట్ కుక్క వాసన పీల్చినప్పుడు దాని మెదడు నుండి వచ్చే నాడీ సంకేతాలను రికార్డు చేస్తుంది.

ఈ డేటాను DogOS అనే ఏఐ ప్లాట్‌ఫామ్‌కు పంపిస్తారు. ఈ సాఫ్ట్‌వేర్ ఆ డేటాను విశ్లేషించి.. ఆ నమూనాలో క్యాన్సర్ లేదా ఇతర వ్యాధి కణాలు ఉన్నాయా అని గుర్తిస్తుంది. ఈ వినూత్న పద్ధతి ద్వారా కేవలం క్యాన్సర్‌ను మాత్రమే కాకుండా కోవిడ్, క్షయవ్యాధి వంటి వ్యాధులను కూడా ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని డాగ్నోసిస్ పేర్కొంది.

డాగ్నోసిస్’ వ్యవస్థాపకులు..

ఈ స్టార్టప్‌ను కాగ్నిటివ్ సైంటిస్ట్ ఆకాష్ కుల్గోడ్, ఇజ్రాయెల్ మాజీ కమాండర్ ఇటామర్ బిటాన్ స్థాపించారు. వారి బృందంలో న్యూరోసైన్స్, ఇంజనీరింగ్, క్లినికల్ ఆపరేషన్స్, సాఫ్ట్‌వేర్ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారు. అనేక పరిశోధనలు కుక్కలు శ్వాస, మూత్రం, చెమటలోని రసాయన మార్పులను గుర్తించగలవని నిరూపించాయని వారు తెలిపారు.

10 రకాల క్యాన్సర్లు

నివేదికల ప్రకారం.. ఈ పద్ధతి ద్వారా సుమారు 10 రకాల క్యాన్సర్లను 98శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చని తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ పద్ధతి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ఆశిస్తున్నారు.

 

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *