తల్లీ కానీ, తండ్రి కానీ రెండో పెళ్లి చేసుకుంటానంటే చాలా మంది పిల్లలు అంగీకరించరు. కానీ ఈ ప్రముఖ నటి పెళ్లికి తన 12 ఏళ్ల కూతురు తోడుగా నిలిచింది. స్వయంగా తల్లిని పెళ్లి మండపానికి తీసుకొచ్చింది. ఇక తల్లి మెడలో మూడుముళ్లు పడుతున్నప్పుడు ఆ కూతురు ముఖంలో ఆనందం చూడాలి.. నెక్ట్స్ లెవెల్ అంతే. ఇలా 12 ఏళ్ల కూతురును పక్కన పెట్టుకుని రెండో పెళ్లి చేసుకున్న యాంకర్ కమ్ నటి పేరు ఆర్య. మలయాళంలో ఫేమస్ నటిగా వెలుగొందుతోన్న ఆమెనటుడు, కొరియోగ్రాఫర్ సిబిన్ బెంజమిన్తో కలిసి ఏడడుగులు నడిచింది. ఇది ఇద్దరికీ రెండో వివాహమే. ఈ ఏడాది మేలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగింది.