మరీ దారుణం.. కలిచివేస్తున్న కమెడియన్ కథ!

మరీ దారుణం.. కలిచివేస్తున్న కమెడియన్ కథ!


ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించిన ఆయన ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆర్ధికంగా బాగా చితికిపోవడమే కాదు.. పక్షవాతంతో మంచానికే పరిమితమై ఉన్నాడు. తన ధీన పరిస్థితితో అందర్నీ బాధపడేలా చేస్తున్నాడు. కమెడియన్ గా పదుల సంఖ్యలో సినిమాల్లో కనిపించి నవ్వులు పూయించాడు రామచంద్ర. ముఖ్యంగా సొంతం, వెంకీ సినిమాల్లో తన కామెడితో ఆకట్టుకున్నాడు. అయితే వెంకీ సినిమా రామచంద్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన పాత్ర సినిమా అంతా ఉంటుంది. దీంతో ఈ కమెడియన్ దశ తిరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రామచంద్ర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25ఏళ్లు అవుతుంది. కానీ ఆయన అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. ఆనందం, వెంకీ, సొంతం వంటి హిట్ సినిమాల్లో నటించినా అనుకున్నంత గుర్తింపు తెచుకోలేకపోయాడు. ఈక్రమంలోనే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. పక్షవాతంతో బాధపడుతున్నారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన బాధను చెప్పుకున్నాడు,.కాళ్లు చేతులు లాగుతున్నాయని డాక్టర్ దగ్గరకు వెళ్తే బ్రెయిన్ లో రెండు క్లాట్స్ ఉన్నాయని చెప్పారు… ఎడమ చేయి, ఎడమ కాలుకు పక్షవాతం వచ్చిందంటూ చెబుతూ రామచంద్ర ఎమోషనల్ అయ్యాడు. అలాగే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆ కమెడియన్ మాటలు కూడా మరో సారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిన్ను చూడాలని సినిమాతో నేను మొదటి అవకాశం అందుకున్నా.. ఆతర్వాత వరుసగా సినిమా ఛాన్స్ లు వచ్చాయి.. కెరీర్‌లో వచ్చిన బ్రేక్ తన జీవితాన్ని గందరగోళంలో పడేసిందని తెలిపాడు. కెరీర్ బిగినింగ్ లో అవకాశాలు ఈజీగా వచ్చాయి.. కానీ ఆతర్వాత రావడం కష్టంగా మారింది. రోడ్డు ప్రమాదం జరగడంతో మూడేళ్లు సినిమాకు దూరం అయ్యా.. దాంతో డబ్బులు అన్నీ అయిపోయాయి. ఆర్ధిక పరిస్థితి దెబ్బతినడంతో అప్పుల పాలు అయ్యాను అని తెలిపాడు. చాలా అప్పులు చేశా.. చాలా వరకు తీర్చేశా.. కానీ ఇంకా ఉన్నాయి. అవకాశాలు రావడం లేదు. నిర్మాతల దగ్గరకు వెళ్తే ఎవరు నువ్వు.? ముఖం గుర్తులేదు అంటున్నారు. ఆ మాటలు చాలా భాదపెట్టాయి.. నేను ఎవరి సాయం కోసం ఎదురుచూడటం లేదు.. కేవలం అవకాశాల కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా అని తెలిపాడు రామచంద్ర.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: పిచ్చెక్కించిన సమంత ‘కానీ ఇంత ఓవర్ అవసరమా..’ అన్నదే టాక్

Mokshagna: మోక్షు ఎంట్రీపై సస్పెన్స్‌ పోయినట్టే ఇక!

Balakrishna: కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. కలిచివేస్తున్న వీడియో…

హమ్మయ్య గండం గట్టెక్కింది! మమూకా సేఫ్

నా టాపిక్ చెబితే.. మీ మ్యాటర్ బయటపెడతా జగపతిబాబుకు శ్రీ లీల వార్నింగ్!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *