Vijayanagaram: చీకట్లో నడుస్తూ వెళ్తుండగా కనిపించింది చూసి హడలిపోయిన రైతు..

Vijayanagaram: చీకట్లో నడుస్తూ వెళ్తుండగా కనిపించింది చూసి హడలిపోయిన రైతు..


Vijayanagaram: చీకట్లో నడుస్తూ వెళ్తుండగా కనిపించింది చూసి హడలిపోయిన రైతు..
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

విజయనగరం జిల్లా డెంకాడ మండలం గుణుపూరుపేటలో ఒక అరుదైన వింతజీవి హల్‌చల్ చేసింది. కొండ ప్రాంతం నుంచి రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించింది ఆ వన్యప్రాణి. ఓ రైతు అటుగా వెళ్తూ ఆ ప్రాణిని చూసి చీకటిలో చూసి ఉలిక్కి పడ్డాడు. అనంతరం భయంతో అక్కడ నుంచి పరుగులు తీసి విషయాన్ని ఇతర గ్రామస్తులకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులు అంతా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ వన్యప్రాణి పక్కనే ఉన్న మురికి కాలువలోకి దిగి వేగంగా అటూఇటూ పరిగెడుతూ హంగామా చేస్తుంది. దీంతో గ్రామస్తులు మరింత భయపడ్డారు.   కొంతసేపటి తర్వాత అది ఒక ప్రదేశంలో ఆగిపోయింది. వెంటనే అదే అదునుగా గ్రామస్తులు అంతా కలిసి మెరుపు వేగంతో ఆ వన్యప్రాణిని ఒడిసి పట్టుకున్నారు. అయితే ఆ ప్రాణిని పట్టుకున్న తరువాత గ్రామస్తులు మరింత భయపడ్డారు. కారణం దాని ఒంటి నిండా పదునైన పొలుసులతో పట్టుకుంటే చెయ్యి కూడా తెగిపోయేలా కనిపించింది. వెంటనే దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. అలా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ సుబ్బారావు తన సిబ్బందితో రాత్రి 11 గంటలకు చేరుకుని ఆ ప్రాణిని గ్రామస్తుల నుంచి సురక్షితంగా స్వాధీనం చేస్తున్నారు.

ఆ వన్యప్రాణిని నిశితంగా పరిశించిన అధికారులు ఇదొక అరుదైన చిప్పల అలుగు అని నిర్ధారించారు. చిప్పల అలుగును కొన్ని ప్రాంతాల్లో పాంగోలిన్‌ అని కూడా పిలుస్తారు. పాంగోలిన్ అనేది కేవలం ఒక అరుదైన వన్యప్రాణి మాత్రమే కాదని, అది పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇవి చీమలు, చెదలు వంటి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయని, ఒక్కో పాంగోలిన్ రోజుకు వేలాది చీమలను తినగలదని, అలా పాంగోలిన్ వల్ల అడవులు చెదల దాడి నుంచి రక్షణ పొందుతాయని తెలిపారు. దీన్ని అడువులు గార్డెనర్‌గా చెబుతుంటారు. ముఖ్యంగా ఇవి ఆసియా, ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా సంచరిస్తూ మట్టిని తవ్వి రంధ్రాలు చేస్తాయని, ఆ రంధ్రాల్లో ఇతర జంతువులకు ఆశ్రయం అందిస్తాయని అన్నారు.

అయితే ఈ పాంగోలిన్ జాతి అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా గుర్తించబడింది. వాటి పొలుసులు, మాంసం కోసం అక్రమ రవాణా పెరిగిపోతుంది. ముఖ్యంగా చైనా, వియత్నాం వంటి దేశాల్లో మెడిసిన్ తయారీతో పాటు ఆహారంగా కూడా ఉపయోగిస్తారనే తెలుస్తుంది. దీన్ని ఇటీవల స్మగ్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర దేశాలకు సరఫరా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. అలాంటి అరుదైన వన్యప్రాణిని కాపాడిన గ్రామస్తులను అటవీ శాఖ అధికారులు అభినందించారు. అనంతరం ఆ అలుగును పక్కనే ఉన్న కొండప్రాంతంలో వదిలేశారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *