బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్లీ వస్తోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ కోసం మరిన్ని హంగులతో ముస్తాబవుతోంది. గతంలో కంటే భిన్నంగా కొత్త రూల్స్, టాస్కులతో ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఉండనుందని తెలుస్తోంది. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనూ బిగ్ బాస్ యాజమాన్యం సరికొత్తగా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే సామాన్యులు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. ఈ పోటీ నుంచి మొత్తం ఐదు గురిని బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా తీసుకోనున్నారు. వీరితో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు కూడా హౌస్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సారి కంటెస్టెంట్ల లిస్టులో ఒకప్పటి సౌతిండియన్ హ్యాండ్సమ్ హీరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా, సహాయక నటుడిగా, నెగెటివ్ రోల్స్ లో నటించి మెప్పించిన ఈ నటుడు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిలయ్యాడు. అయితే ఈ మధ్యనే మళ్లీ ఈ నటుడి పేరు బాగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఎలాగైనా ఈ నటుడిని హౌస్ లోకి తెచ్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తోందదని సమాచారం. ఈ విషయమై సదరు నటుడితో బిగ్ బాస్ నిర్వాహకులు మంతనాలు జరిపారని, అతను కూడా రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించాడని సమాచారం. దీంతో ఆ హీరో అభిమానులతో పాటు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? ప్రేమ దేశం సినిమాతో సెన్సేషన్ సృష్టించిన అబ్బాస్.
తెలుగు, తమిళం భాషలలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించాడు అబ్బాస్. అయితే 2009 లో రిలీజైన బ్యాంక్ సినిమా తర్వాత వెండితెరపై కనిపించలేదీ హ్యాండ్సమ్ హీరో. అప్పుడప్పుడు కొన్ని యాడ్లలో మాత్రమే కనిపించాడు. ఆ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ కు వెళ్లిపోయాడు అబ్బాస్. అక్కడ పెట్రోల్ బంక్ తో పాటు మెకానిక్ గా పని చేశాడు. ప్రస్తుతం అబ్బాస్ న్యూజిలాండ్ లో ఐటీ జాబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
అబ్బాస్ లేటెస్ట్ ఫొటోస్..
ఒకవేళ అబ్బాస్ బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తే మాత్రం హౌస్ కు కళ వచ్చినట్లే. మరి ఇందులో ఎంత నిజమెంతుందో తెలియాలంటే బిగ్ బాస్ షో లాంఛింగ్ దాకా ఆగాల్సిందే. కాగా బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.