హైదరాబాద్, ఆగస్ట్ 22: దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి PM Yashasvi Scholarship 2025 నోటిఫికేషన్ విడుదలైంది. యేటా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం యశస్వి స్కాలర్షిప్ను ఈ ఏడాది కూడా అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో గుర్తింపు పొందిన పాఠశాల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్ధులకు ఏడాదికి రూ.75 వేలు, అలాగే 11వ, 12వ తరగలు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ.1,25,000 వరకు ఈ స్కాలర్షిప్ కింద అందిస్తోంది. దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలలోపు ఉండాలి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆగస్ట్ 31వ తేదీ లోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. PM YASASVI Entrance Test 2025లో ప్రతిభకనబరచిన విద్యార్ధులను మాత్రమే ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు వెబ్సైట్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు.
ఏపీ డిగ్రీ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశాల కోసం విద్యార్ధులు ఆగస్టు 26వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ అభ్యర్ధులు రూ.400, బీసీ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఆగస్ట్ 25 నుంచి 28 ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాలను ఆగస్ట్ 24 నుంచి 28 వరకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
వెబ్ ఐచ్ఛికాలలో మార్పులు చేసుకోవడానికి ఆగస్ట్ 29న అవకాశం ఉంటుంది. ఇక ఆగస్ట్ 31న సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ మేరకు డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.