మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక నాగబాబు కూతురు నిహారిక కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నిహారికాకు మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే నిహారిక మెల్లగా హీరోయిన్ గా అడుగులేసింది. నాగశౌర్య హీరోగా ఒక మనసు అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో నిహారిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఆతర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆతర్వాత నిర్మాణ రంగం వైపు అడుగులేసింది. ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేసింది నిహారిక.ఇదిలా ఉంటే నిహారిక చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. కానీ ఈ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. ఈ ఇద్దరూ 2023లో విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే విడాకుల తర్వాత నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టింది. సినిమాలను నిర్మిస్తూ తన పని తాను చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే నిహారిక రెండో పెళ్లి గురించి ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
కాగా నిహారిక ఇటీవలే కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను నిర్మించి డీసెంట్ హిట్ అందుకుంది. ఇప్పుడు సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు. తాజాగా నిహారిక వదిలిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.