Chiranjeevi Birthday: ఒక్కడిగా వచ్చి.. ఒకొక్కటీ సాధిస్తూ.. ఇండస్ట్రీలో ఒకేఒక్కడిగా..

Chiranjeevi Birthday: ఒక్కడిగా వచ్చి.. ఒకొక్కటీ సాధిస్తూ.. ఇండస్ట్రీలో ఒకేఒక్కడిగా..


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సింగిల్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మెగాస్టార్‌గా మారారు. నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చిరు తన స్వయం కృషి, నటనతో, డాన్స్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అప్పట్లో విభిన్న పాత్రల్లో నటించి తన నటనతో అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ పాత్రలోనైనా సరే ఈ హీరో ఇట్టే ఒదిగిపోతారు. ఓన్లీ యాక్టింగ్‌నే కాకుండా తన డ్యాన్స్‌తో ఎంతో మంది మనసుదోచుకున్నారు ఈ హీరో.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

ఇక ఆరోజుల్లో చిరు సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్స్ వద్ద సందడి మాములుగా ఉండకపోయేది. చిరు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసేవారు అంటుంటారు. అయితే అప్పుడే కాదు, ఈ తరం వారికి కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టం, ఇప్పటీకీ ఈయన సినిమా వస్తే థియేటర్స్ వద్ద ఆయన ఫ్యాన్స్ బారులు తీరుతుంటారు.

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

అంతే కాకుండా చిరకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే ఇట్టే ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంటారు. ఎంతో మంది హీరోలకు రోల్ మోడల్ అయిన చిరు గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆయనకు పర్సనల్ విషయాలు, సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు చిరంజీవి. త్వరలోనే విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *