కాఫీలో లభించే యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. కొన్ని రకాల క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులను నివారించడంలో కూడా మేలు చేస్తాయి. అందుకే రోజుకు 1 నుండి 2 కప్పుల కాఫీ తాగడం అలవాటు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.