రెండు రాష్ట్రాల పర్యటనకు ప్రధాని మోదీ.. ఎజెండా ఎంటో తెలుసా..?

రెండు రాష్ట్రాల పర్యటనకు ప్రధాని మోదీ.. ఎజెండా ఎంటో తెలుసా..?


బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. బీహార్ రాజధాని పాట్నా లో కొత్తగా నిర్మించిన మొకామా నుంచి బిగూసరాయ్‌ వరకు ఆరులేన్ల బ్రిడ్జిని ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం కోల్‌కతా మెట్రోను కూడా మోదీ ప్రారంభిస్తారు.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో మరోసారి పర్యటిస్తున్నారు. బీహార్‌లో రూ. 18 వేల కోట్ల ప్రాజెక్ట్‌లను ప్రధాని ప్రారంభిస్తారు. పాట్నా లోని మొకామా నుంచి బిగూసరాయ్‌ వరకు ఆరులేన్ల బ్రిడ్జిని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వంతెన నిర్మాణానికి రూ. 1,870 కోట్ల ఖర్చయ్యింది. 8 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. మరో నేషనల్‌ హైవే ప్రాజెక్ట్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. గంగానదిపై ఈ వంతెనను నిర్మించారు. పురాతన బ్రిడ్జి స్థానంలో ఈ వంతెనను నిర్మించారు. బీహార్‌లో ప్రధాని మోదీ ఈ ఏడాది ఐదోసారి పర్యటిస్తున్నారు.

బీహార్‌లో విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ, ప్రధానమంత్రి దాదాపు రూ.6,880 కోట్ల విలువైన బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. ఇది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతుంది. ఇంధన భద్రతను మెరుగుపరుస్తుంది. అంతేకాక, ఈ ప్రాంతంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీరుస్తుంది. మరో వైపు, ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం ముజఫర్‌పూర్‌లో హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్‌ను మోదీ ప్రారంభిస్తారు.

బీహార్‌ పర్యటన తరువాత మోదీ బెంగాల్‌ వెళ్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. జాతీయ రహదారి-31లోని దాదాపు రూ. 1,900 కోట్ల విలువైన నాలుగు లేన్ల రోడ్డు, భక్తియార్‌పూర్ నుండి మోకామా సెక్షన్‌ను ప్రారంభిస్తారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. అటు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.

బెంగాల్‌లో కోల్‌కతా మెట్రో ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభిస్తారు. మూడు మెట్రో ప్రాజెక్ట్‌లను మోదీ ప్రారంభిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరవుతారా ? లేదా ? అన్న విషయంపై సస్పెన్స్‌ నెలకొంది. బెంగాల్‌ అభివృద్ది బీజేపీ తోనే సాధ్యమంటున్నారు ఆ పార్టీ నేతలు . మెట్రో ప్రారంభోత్సవానికి మమతా హాజరుకావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *