పశ్చిమ బెంగాల్ హుగ్లీకి చెందిన సుజిత్ మండల్ తనకు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కొన్నగర్ కనైపూర్‌లో నివాసం ఉంటున్నారు. సుజిత్ రోజువారి కూలీ పనులు చేసి కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో సడెన్‌గా అతని భార్య ఆరోగ్యం క్షీణించింది. ఆమెను చికిత్స చేయించేందుకు ఎన్నో హస్పిటల్స్ తిరిగాడు. చిరవకు ప్రభుత్వ ఆసుపత్రి చేర్పించాడు. అయితే సుజిత్ తను కూలీ పనులకు వెళ్లి వచ్చే డబ్బులో కొంత డబ్బును పెట్టి లాటరీలు కొనేవాడు. ఏదో ఒక లాటరీ తన జీవితాన్ని మర్చుతుందని ఆతను బలంగా నమ్మేవాడు. ఈ నమ్మకమే ఆయనను కోటీశ్వరుడిని చేసింది. అతను రూ.30 పెట్టి కొన్న లాటరీ రూ.కోటి మొదటి ప్రైజ్ ను గెలుచుకుంది. దీంతో అప్పటి వరకు కూలీగా ఉన్న సుజిత్ ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ డబ్బుతో తన భార్య ఆరోగ్యాన్ని బాగు చేయించుకుంటానన్నాడు.
అయితే తనను లాటరీ వరించడంపై సుజిత్ స్పందించాడు. తాను గత నాలుగైదేళ్లుగా లాటరీ కొంటున్నానని.. గత వారం ఎప్పటిలాగానే లాటరీ కౌంటర్ నుంచి రూ.30 తో ఓ లాటరీ టికెట్ కొన్నానని చెప్పాడు. కానీ తనకు లాటరీలో రూ.కోటి బహుమతి వస్తుందని అనుకోలేదు అన్నాడు. ఈ లాటరీ డబ్బులతో ముందుగా తన భార్య ఆరోగ్యాన్ని బాగు చేయించుకుంటానని చెప్పాడు.
సుజిత్ రూ.కోటి లాటరీ వరించడంపై టికెట్ అమ్మకందారుడు మాట్లాడుతూ.. కొన్నేళ్ల నుంచి సుజిత్ తన దగ్గర లాటరీ కొంటున్నాడని.. అయితే కొన్న లాటరీలను తనతో తీసుకెళ్లకుండా.. నీ దగ్గరే ఉంచుకోమని చెప్పేవాడని ఆయన చెప్పుకొచ్చారు. అప్పుడు సుజిత్ టికెట్‌పై తన పేరు రాసి బ్యాగులో ఉంచుకునే వాడినని.. ఇప్పుడు సుజిత్ గెలిచిన లాటరీ కూడా తన బ్యాగులో ఉన్నదేనని తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.