Tech Tips: కొత్త హెడ్‌ఫోన్స్‌ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 ఫీచర్స్‌ కచ్చితంగా ఉండేలా చూసుకోండి!

Tech Tips: కొత్త హెడ్‌ఫోన్స్‌ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 ఫీచర్స్‌ కచ్చితంగా ఉండేలా చూసుకోండి!


నేటి డిజిటల్ ప్రపంచంలో, హెడ్‌ఫోన్‌లు పాలటు వినడానికి మాత్రమే కాదు. పనికి సంబంధించిన ఆఫీస్ కాల్స్, సమావేశాలు, గేమింగ్, ప్రయాణం, వ్యాయామం వంటి పలు రకాల అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ రోజుల్లో, ఆధునిక హెడ్‌ఫోన్‌లు AI , స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్, మల్టీ-డివైస్ మేనేజ్‌మెంట్, 3D సౌండ్ వంటి అనేక లక్షణాలతో అందుబాటులో ఉన్నాయి. మన బడ్జెట్, అవసరాల ఆధారంగా మనం హెడ్‌ఫోన్‌లను ఎంచుకోవచ్చు. హెడ్‌ఫోన్‌లు కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను పరిశీలించడం ద్వారా మనం మంచి మ్యూజిక్ అనుభూతిని, అద్భుత ఫీచర్లను పొందే అవకశాం ఉంటుంది. కాబట్టి మీరు హెడ్‌ఫోన్స్‌ కొనేముందు ఈ ఐదు అంశాలను ఒకసారి పరిశీలించండి.

నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్

కొన్ని హై-ఎండ్ హెడ్‌ఫోన్‌లు మనం ఉన్న వాతావరణం, మనం వింటున్న విషయాలను బట్టి ఆడియోను వాటంతకవే సర్దుబాటు చేస్తాయి. ప్రత్యేకంగా, మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లు, సినిమాలు వంటి మనం చూస్తున్న కంటెంట్ ప్రకారం అవి స్వయంచాలకంగా సెట్టింగ్‌లను మారుస్తాయి. ఉదాహరణకు, మీరు నిశ్శబ్ద గదిలో ఉన్నారా లేదా బాగా సౌండ్‌ వచ్చే వీధిలో నడుస్తున్నారా అనే దానిపై నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌లు పనిచేస్తాయి. ఈ ఫీచర్ తరచుగా ప్రయాణించేవారు, వ్యవస్థాపకులు మొదలైన వారికి అనుకూలంగా ఉంటుంది. హెడ్‌ఫోన్‌లను కొనుగోలు చేసేటప్పుడు, వాటిలో ఈ ఫీచర్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.

ఒకేసారి రెండు మొబైల్స్‌కు కనెక్ట్‌ చేయడం

ఇప్పుడు వస్తున్న హెడ్‌ఫోన్‌లలో చాలా వరకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు వంటి బహుళ పరికరాలకు ఒకేసారి కనెక్ట్ కాగలవు. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు మనం ఉపయోగిస్తున్న పరికరాలను వాటంతటకవే గుర్తించి వాటికి కనెక్ట్ అవుతాయి. దీని వలన పరికరాలను మార్చేటప్పుడు సమస్యలను నివారించవచ్చు. తరచుగా హెడ్‌ఫోన్ వినియోగదారులు ఈ రకమైన హెడ్‌ఫోన్‌ను ఎంచుకోవచ్చు.

హెడ్‌ఫోన్ నాణ్యత

మనం హెడ్‌ఫోన్స్‌ను ఎక్కువ కాలం యూజ్‌ చేయాలనుకుంటే వాటి నాణ్యతను చూడడం ఎంతో ముఖ్యం. కార్బన్ ఫైబర్ ఫ్రేమ్‌లు, కూలింగ్ మెమరీ ఫోమ్ కుషన్‌లను ఉత్తమ నమూనాలుగా చెప్తారు. వ్యాయామం చేసేవారు, నడిచే వారు అలాంటి హెడ్‌ఫోన్‌లను కొనుగోలు చేసి ఉపయోగించడం మంచిది. మంచి హెడ్‌ఫోన్ డిజైన్ దీర్ఘకాలంలో అసౌకర్యాన్ని నివారిస్తుంది.

3D ఆడియో సౌకర్యం..

ఈ రోజుల్లో, ఆధునిక హెడ్‌ఫోన్‌లు 3D ఆడియో ఫీచర్‌లతో అందుబాటులో ఉన్నాయి. వీటని పెట్టుకొని మన ఫోన్‌లో సినిమా చూస్తున్నప్పుడు మనకు థియేటర్‌లో సినిమా చూస్తున్న అనుభవాన్ని ఇస్తాయి. ఈ రకమైన హెడ్‌ఫోన్‌లు తరచుగా సినిమాలు చూసే వారికి అనుకూలంగా ఉంటాయి.

బయటి శబ్దాలను వినగల సామర్థ్యం.

ఇప్పుడొచ్చే కొన్ని హెడ్‌ఫోన్స్‌లో ట్రాన్స్‌పరెన్సీ మోడ్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ వల్ల బయటి శబ్దాలు వినడానికి వీలు కలుగుతుంది. ప్రయాణించేటప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు లేదా రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఈ ఫీచర్ మనకు భద్రతను అందిస్తుంది. ముఖ్యంగా రోడ్డుపై నడుస్తున్న వారికి వాహనాల శబ్దాలు వినడానికి ఈ రకమైన హెడ్‌ఫోన్‌లు ఉపయోగపడతాయి. దీనితో పాటు, కొనుగోలు చేసే ముందు బ్యాటరీ నిర్వహణ సౌకర్యం ఉందో లేదో కూడా మీరు తనిఖీ చేయవచ్చు. AI ఆధారంగా రూపొందించబడిన ఈ ఫీచర్, మనం హెడ్‌ఫోన్‌లను ఉపయోగించనప్పుడు వాటిని స్లీప్ మోడ్‌కి మారుస్తుంది. ఇది బ్యాటరీ చార్జ్‌ త్వరగా అయిపోకుండా చూస్తుంది. అదేవిధంగా, దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *